టైప్-1 షుగర్ బాధలకు చెక్! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!
వరంగల్‌కు చెందిన 14 ఏళ్ల ప్రహాసిత్ టైప్-1 డయాబెటిస్ నిర్వహణలో ఆధునిక వైద్య సాంకేతికతతో కొత్త ఆశను పొందాడు. సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మెడ్‌ట్రానిక్ మినీమెడ్ 780జీ ఇన్సులిన్ పంప్‌తో పాటు గార్డియన్ 4 గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్‌ను ఉపయోగించారు. ఈ వ్యవస్థ గ్లూకోజ్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరానికి అనుగుణంగా ఇన్సులిన్ పంపిణీని సర్దుబాటు చేస్తుంది. అయితే, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.
టైప్-1 డయాబెటిస్… ఈ పేరు వినగానే ఏ తల్లిదండ్రులకైనా గుండెల్లో రాయి పడుతుంది. చిన్న వయసులోనే పిల్లలకు ఈ వ్యాధి వస్తే… జీవితమంతా రోజూ నాలుగు నుంచి ఆరు సార్లు ఇంజెక్షన్లు పొడుచుకోవాలా? బడికి వెళ్లాలన్నా, ఆటలాడాలన్నా, స్నేహితులతో బయటకు వెళ్లాలన్నా ప్రతీక్షణం భయంతోనో, షుగర్ లెవల్స్ పడిపోతాయనే ఆందోళనతోనే బతకాలా? వైద్యశాస్త్రం ఎంత ముందడుగు వేసినా… పిల్లల భవిష్యత్తుకు ఈ డయాబెటిస్ ఒక శాపంగానే మారుతోందా? ఆధునిక వైద్య సాంకేతికత ఈ ప్రశ్నలన్నింటికీ ఒక అద్భుతమైన జవాబు చెప్పింది. వరంగల్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల ప్రహాసిత్ అనే ఒక సాధారణ బాలుడి జీవితంలో వచ్చిన మార్పు… ఈ రోజు దేశవ్యాప్తంగా టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న వేలాదిమంది చిన్నారులకు, వారి తల్లిదండ్రుల కళ్లలో కొత్త ఆశలను నింపుతోంది. ఇంతకీ ఏంటీ సాంకేతికత? ఆ 14 ఏళ్ల బాలుడు వ్యాధిని జయించి సాధారణ జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు? ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చేసిన ఆ ప్రయోగం ఏమిటి? రండి… పూర్తి వివరాల్లోకి వెళ్దాం! మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఒకటే. టైప్-1 డయాబెటిస్ అనేది జీవనశైలి వల్ల వచ్చే సాధారణ మధుమేహం కాదు. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్‌లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే ఒక ఆటోఇమ్యూన్ పరిస్థితి. అంటే, చిన్నతనం నుంచే బాధితుడి శరీరంలో ఇన్సులిన్ అసలు తయారవ్వదు. వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రహాసిత్ చిన్నతనంలోనే ఈ సమస్య బారిన పడ్డాడు. రోజుకు నాలుగైదు సార్లు సీసా నుంచి ఇన్సులిన్ తీసి శరీరంపై పొడుచుకోవడం… గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకోవడానికి ప్రతీసారీ వేలికి సూది గుచ్చుకోవడం… ఇది కేవలం శారీరక బాధ మాత్రమే కాదు, ఆ బాలుడికి, ఆ కుటుంబానికి ఎదురైన నిరంతర మానసిక నరకం. ముఖ్యంగా రాత్రి వేళల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయే హైపోగ్లైసీమియా వస్తుందేమోనని ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోయిన రాత్రులే లేవు. స్కూల్ ట్రిప్స్, ఆటపాటలు, బంధువుల ఇళ్లకు వెళ్లడం… అన్నింటికీ ఈ డయాబెటిస్ ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రహాసిత్ కుటుంబం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బాస్కెను సంప్రదించారు. ప్రహాసిత్కు కేవలం మందులు రాయడం కాకుండా… అతని జీవిత నాణ్యతను మార్చాలని డాక్టర్ కిషోర్ బాస్కె బృందం నిర్ణయించింది. ప్రహసిత్ చికిత్స కోసం వారు తీసుకువచ్చిన అత్యాధునిక పరికరమే మెడ్‌ట్రానిక్ మినీమెడ్ 780జీ హైబ్రిడ్ క్లోజ్డ్-లూప్ ఇన్సులిన్ పంప్. దీనికి గార్డియన్ 4 నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ సెన్సార్‌ను అనుసంధానించారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఈ చిన్న సెన్సార్ ప్రతీ నిమిషం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను లెక్కిస్తుంది. ఆ రీడింగ్స్ ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్ శరీరానికి ఎంత ఇన్సులిన్ అవసరమో అంత మాత్రమే ఆటోమేటిక్‌గా పంపుతుంది. షుగర్ లెవల్స్ ఎక్కువైనా, లేదా డేంజర్ మార్క్ కంటే తగ్గిపోతున్నా… ఈ పరికరమే హెచ్చరించి, ఇన్సులిన్ పంపిణీని నియంత్రిస్తుంది. ఈ పరికరం ఫలితం ఎలా ఉందో తెలుసా? కేవలం కొద్ది నెలల్లోనే ప్రహాసిత్ గ్లూకోజ్ స్థాయిలు సంపూర్ణ నియంత్రణలోకి వచ్చాయి. రోజూ పొడుచుకునే సూదుల బాధ తప్పింది. ఇప్పుడు ప్రహాసిత్ తోటి పిల్లల్లాగే స్కూల్‌కి వెళ్తున్నాడు, మైదానాల్లో ఆటలాడుతున్నాడు, ఫ్రెండ్స్ ఇళ్లల్లో నైట్ స్టేలు చేస్తున్నాడు. ప్రహాసిత్ తల్లిదండ్రులు ఆనందంగా చెబుతున్న మాట ఒకటే – ఇంతకుముందు మా కుటుంబ జీవితమంతా ఈ వ్యాధి చుట్టూనే తిరిగేది. ఇప్పుడు మా అబ్బాయికి స్వేచ్ఛ వచ్చింది. మేమూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. డాక్టర్ కిషోర్ బాస్కె అన్నట్లు… మన లక్ష్యం కేవలం షుగర్ లెవల్స్ తగ్గించడం మాత్రమే కాకూడదు. ఆ పిల్లలు తమ కలలను నెరవేర్చుకునేలా, తమ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకునేలా చేయడం ప్రధానం. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్నాలజీ అమర్చుకున్నంత మాత్రాన వైద్యుల పర్యవేక్షణ, సరైన శిక్షణ లేకుండా ఏదీ సాధ్యపడదు. సరైన నాలెడ్జ్, మెడికల్ గైడెన్స్ ఉంటే డయాబెటిస్ అనేది ఏ చిన్నారికీ శాపం కాదు. సాంకేతికత.. వైద్యానికి తోడైతే మానవ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చెప్పడానికి ఈ 14 ఏళ్ల వరంగల్ బాలుడి జీవితమే ఉదాహరణ. ఈ సమాచారం మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి టైప్-1 డయాబెటిక్ చైల్డ్ ఉన్న కుటుంబానికి చేరేలా చూడండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!
Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ

