AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్‌ నుంచి బార్‌ ఓనర్‌గా

Lucky Draw: ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్‌ నుంచి బార్‌ ఓనర్‌గా

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 3:56 PM

Share

హనుమకొండకు చెందిన టీ స్టాల్ యజమాని వల్లపు వెంకటేష్ అదృష్టం పండించింది. కేవలం లక్ష రూపాయలతో లక్కీ డ్రాలో పాల్గొని, 368 మంది పోటీదారులను వెనక్కు నెట్టి, ములుగు జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను దక్కించుకున్నారు. కూలి పనులు చేసుకుంటూ టీ స్టాల్‌ నడుపుకున్న వెంకటేష్ రాత్రికి రాత్రే బార్ యజమానిగా మారి, అందరినీ ఆశ్చర్యపరిచారు.

అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో ఊహించడం అసాధ్యం. ఆవగింజంత అదృష్టం కలిసొచ్చినా, ఒక సామాన్య వ్యక్తిని రాత్రికి రాత్రి కోటీశ్వరుణ్ణి చేయగలదు. అందుకు హనుమకొండకు చెందిన వల్లపు వెంకటేష్ కథే తాజా ఉదాహరణ. హనుమకొండ బస్టాండ్ వద్ద ఒక చిన్న టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేష్, లక్కీ డ్రాలో ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను గెలుచుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ములుగు జిల్లా కేంద్రంలోని నూతన మున్సిపాలిటీ పరిధిలో ఒకే ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ కోసం ఆబ్కారీ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ ఒక్క లైసెన్స్ కోసం బడా వ్యాపారులు, రియల్టర్లు సహా ఏకంగా 368 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ లక్కీ డ్రా తమకే దక్కాలని ఆశించగా, అదృష్టం మాత్రం వల్లపు వెంకటేష్‌ను వరించింది. కేవలం ఒక లక్ష రూపాయల కష్టార్జితాన్ని వెచ్చించి టెండర్ వేసిన వెంకటేష్‌ను లక్కీ డ్రా రూపంలో అదృష్టం వరించింది. ఈ అనూహ్య విజయం పట్ల వెంకటేష్ భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక చిన్న టీ స్టాల్ యజమాని బార్ యజమానిగా మారడంతో జిల్లాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Surya kumar Yadav: దుబాయ్‌లో షారుక్ ఖాన్ ఇంటి పక్కనే.. ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్

Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

చేతి వాచ్‏లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్

సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!

Follow Us