Surya kumar Yadav: దుబాయ్‌లో షారుక్ ఖాన్ ఇంటి పక్కనే.. ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. డెనుబ్ ప్రాపర్టీస్‌కు చెందిన షారుఖ్జ్ రెసిడెన్సెస్ ప్రాజెక్ట్‌లో ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కొనుగోలుతో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు పొరుగువారిగా మారనున్నారు. దుబాయ్‌లోని జీవన ప్రమాణాలు, భద్రత, ప్రీమియం సదుపాయాలు తనను ఆకట్టుకున్నాయని సూర్య వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో 40కి పైగా సదుపాయాలు ఉండటం విశేషం.
క్రికెట్ మైదానంలో తన 360 డిగ్రీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే మన మిస్టర్ 360… టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు మరో బ్లాక్‌బస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈసారి బ్యాట్‌తో కాదు… రియల్ ఎస్టేట్‌లో అదిరిపోయే రికార్డ్ సృష్టించాడు. దుబాయ్ గడ్డపై కోట్లు విలువ చేసే ఒక అల్ట్రా-లగ్జరీ ఇంటిని సొంతం చేసుకున్నాడు. ఈ గుడ్‌న్యూస్‌ను స్వయంగా సూర్య తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ కొనుగోలు వెనుక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో ఒక క్రేజీ కనెక్షన్ ఉందట. సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌లోని ప్రఖ్యాత ‘డెనుబ్ ప్రాపర్టీస్’కు చెందిన ‘షారుఖ్జ్ రెసిడెన్సెస్’ ప్రాజెక్ట్‌లో ఈ లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పేరుతో ప్రత్యేక కనెక్షన్ ఉండటంతో పాటు, ఇది షారుక్ నివాసానికి, ఆయన ప్రాజెక్ట్‌లకు అత్యంత సమీపంలో ఉండటం విశేషం. దీంతో సూర్య నేరుగా షారుక్ ఖాన్‌కు నైబర్‌గా మారబోతున్నాడు. 2014లో తాను మొదటిసారి ఐపీఎల్ కోసం దుబాయ్‌కి వచ్చానని, ఆ తర్వాత 2020లో మళ్లీ ఇక్కడకు వచ్చానని సూర్య గుర్తు చేసుకున్నాడు. దుబాయ్‌లో జీవన ప్రమాణాలు, అత్యున్నత భద్రత, అక్కడ లభించే ప్రశాంతత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపాడు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న 40కి పైగా ప్రీమియం సదుపాయాలతో పాటు, ప్రత్యేకంగా ‘లాంజెవిటీ లాంజ్’ తనను ఎంతగానో ఆకట్టుకుందని సూర్య ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ బిల్డింగ్ ప్రైవేట్ యట్ రైడ్ గురించి కూడా ఆయన సరదాగా ముచ్చటించారు. మొత్తానికి క్రికెట్ పిచ్ పై తన దూకుడుతో ప్రపంచాన్ని ఏలుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఇలా గ్లోబల్ లెవెల్‌లో లగ్జరీ ఆస్తులను కొనుగోలు చేస్తూ తన రేంజ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్!
చేతి వాచ్‌లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

