AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!

సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!

Phani CH
|

Updated on: Oct 19, 2026 | 4:45 PM

Share

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం, రోళ్ల మండలాలు వక్క తోటలతో కళకళలాడుతున్నాయి. పచ్చని తోటలతో ఈ ప్రాంతానికి ‘రాయలసీమ కేరళ’ అనే పేరు వచ్చింది. వక్క సాగు రైతులకు ఆదాయంతో పాటు స్థానిక కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. అయితే నీటి ఎద్దడి, తెగుళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. అమరాపురంలో వక్క మార్కెట్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.

ఎటు చూసినా పచ్చని వాతావరణం, కొబ్బరి తోటలను తలపించే ఎత్తైన చెట్లతో కళకళలాడే ఈ ప్రాంతం కేరళ అనుకుంటే పొరపడినట్లే. ఇది మన శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం. ముఖ్యంగా అమరాపురం, రోళ్ళ మండలాల్లో అడుగుపెడితే పచ్చని వక్క తోటలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని అందరూ ‘రాయలసీమ కేరళ’ అని పిలుస్తారు. ఈ సాగు ఇక్కడి స్థానిక రైతులకు బంగారు పంటగా మారి సిరులు కురిపిస్తోంది. ఈ ప్రాంతంలోని పొదపారే ఎర్రని నేలలు, వొండ్రు మట్టి నేలలు వక్క సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల పాటు ఈ తోటలు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు, వక్క తోటల నీడను సద్వినియోగం చేసుకుంటూ అరటి, మిరియాలు, తమలపాకులను అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు అదనపు ఆదాయం గడిస్తున్నారు. ఈ సాగు కేవలం రైతుల ఆర్థిక ఇబ్బట్లు తీర్చడమే కాకుండా, వందలాది కుటుంబాలకు నిరంతరం ఉపాధినిస్తోంది. చెట్లెక్కి కాయలు కోయడం దగ్గర నుంచి పొట్టు వేరు చేయడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం వరకు ప్రతి దశలోనూ స్థానిక కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వక్కకు సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు, శివమొగ్గ, చిత్రదుర్గ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉంది. అయితే ఈ సిరుల పంటను నీటి ఎద్దడితో పాటు వర్షాకాలంలో వచ్చే సుడి తెగులు తీవ్రంగా వేధిస్తున్నాయి. పైగా ఎత్తైన చెట్లకు మందులు పిచికారి చేయడం, కాయలు కోయడం రైతులకు కత్తి మీద సాములా మారింది. స్థానికంగానే ప్రాసెసింగ్, గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, కాయలు కోసేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు, డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసే యంత్రాలను ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీతో అందించాలని రైతాంగం కోరుతోంది. ప్రభుత్వం స్పందించి అమరాపురంలో ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తే రవాణా ఖర్చులు తగ్గి మరింత మేలు జరుగుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సరిహద్దు మార్కెట్లపై ఆధారపడకుండా స్థానికంగానే వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామని గతంలో మడకశిర పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రైతులు గుర్తుచేస్తున్నారు. వక్క రైతుల ఇబ్బట్లను గుర్తించిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని బలంగా లేవనెత్తారు. త్వరలోనే అమరాపురంలో వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను అందుబాటులోకి తెస్తే తమ కష్టాలు తీరుతాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LIC: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే కొత్త పాలసీలు..

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

రుణ గ్రహీతలకు షాక్‌.. వడ్డీ రేట్లు పెంచేసిన SBI

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వారికీ రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు!

బిగ్ అలర్ట్.. ఇకపై విమాన ప్రయాణంలో అది తీసుకెళ్లటం కుదరదు

Follow Us