AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుణ గ్రహీతలకు షాక్‌.. వడ్డీ రేట్లు పెంచేసిన SBI

రుణ గ్రహీతలకు షాక్‌.. వడ్డీ రేట్లు పెంచేసిన SBI

Phani CH
|

Updated on: Oct 19, 2026 | 4:28 PM

Share

ఎస్‌బీఐ రుణ వడ్డీ రేట్లను పెంచినట్లు వచ్చిన సమాచారం రుణగ్రహీతల్లో చర్చకు దారితీసింది. ఈబీఎల్‌ఆర్‌ను 7.90 శాతం నుంచి 8.15 శాతానికి, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.50 శాతం నుంచి 7.75 శాతానికి పెంచినట్లు కథనం పేర్కొంటోంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.70 శాతం నుంచి 8.85 శాతానికి చేరినట్లు తెలిపింది. ఈ మార్పులు వర్తించే ఫ్లోటింగ్‌ రేటు రుణాలపై ఈఎంఐ లేదా రుణ కాలపరిమితి ప్రభావితం కావచ్చు.

దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాకిచ్చింది. రుణగ్రహీతలపై వడ్డీ భారాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో, ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచింది. ఈ సవరించిన కొత్త రేట్లు అక్టోబర్ 15 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. ఈబీఎల్‌ఆర్ రేటును 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెంచారు. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ రేటును 7.50 శాతం నుంచి 7.75 శాతానికి చేర్చారు. ఈ రెండు రేట్లు పావు శాతం మేర పెరగడంతో కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి వడ్డీ భారం తక్షణమే పడనుంది. వీటితో పాటు ఎంసీఎల్‌ఆర్ రేటును కూడా ఎస్‌బీఐ సవరించింది. మూడు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌పై 15 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచారు. దీంతో అత్యధికులు ఉపయోగిస్తున్న ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్ 8.70 శాతం నుంచి 8.85 శాతానికి ఎగబాకింది. పాత గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు ఎక్కువగా దీనితోనే ముడిపడి ఉంటాయి. అయితే, ఓవర్‌నైట్ మరియు ఒక నెల కాలపరిమితి గల ఎంసీఎల్‌ఆర్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో లోన్లు తీసుకున్న అందరిపై ఈఎంఐల భారం పడనుంది. ఈ కొత్త రేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై వారికీ రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు!

బిగ్ అలర్ట్.. ఇకపై విమాన ప్రయాణంలో అది తీసుకెళ్లటం కుదరదు

Follow Us