AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

Phani CH
| Edited By: |

Updated on: Oct 19, 2026 | 5:20 PM

Share

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో భారత్‌, చైనాకు తక్షణ ఉపశమనం లభించే అవకాశం ఉంది. గతంలో భారత్‌పై విధించిన అదనపు సుంకాలను తొలగించి, పరస్పర సుంకాన్ని 18 శాతానికి తగ్గించిన అమెరికా.. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మళ్లీ సుంకాలు విధించే అవకాశం ఉండటంతో వాణిజ్య సంబంధాలపై ఆసక్తి నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు భారీ ఊరటనిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయంతో భారత్‌, చైనాకు తక్షణ ఉపశమనం లభించింది. గత నెలలో ట్రంప్ సంతకం చేసిన బిల్లు ప్రకారం.. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనా సహా పలు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ ఆంక్షల అమలుకు అక్టోబర్ 18 గడువుగా నిర్ణయించారు. అయితే, గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి ఆంక్షల అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అదనంగా 25 శాతం సుంకం విధించింది. అయితే, 2026 ఫిబ్రవరిలో ఆ అదనపు సుంకాన్ని తొలగించగా.. పరస్పర సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు. తాజాగా 100 శాతం సుంకాల ముప్పు కూడా తాత్కాలికంగా తప్పడంతో భారత ఎగుమతులకు ఊరట లభించినట్లయింది. మరోవైపు, 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే తమకు ముఖ్యమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిధ దేశాల నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని తెలిపింది. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం శాశ్వతం కాదు. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మళ్లీ సుంకాలు విధించే అవకాశం ఉంది. దీంతో భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూసీకి మహర్దశ! రూ.7,345 కోట్లతో పనులు.. టెండర్లు షురూ!

చేతి వాచ్‏లోనూ రామమందిరం, శ్రీరాముడి చిత్రాలు.. ధర తెలిస్తే ఫ్యూజుల్ అవుట్

సిరులు కురిపిస్తున్న వక్క తోటలు.. చిగురిస్తున్న రైతుల ఆశలు!

LIC: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే కొత్త పాలసీలు..

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌!

Published on: Oct 19, 2026 05:18 PM
Follow Us