Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్

గతేడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ విధంగా గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ తర్వాత వరుసగా పదవీ బాధ్యతలు చేపట్టని రెండవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా, డోనాల్డ్ ట్రంప్ క్రిమినల్ నేరానికి పాల్పడిన మొదటి అధ్యక్షుడిగా అలాగే కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన రెండవ అత్యంత వయసున్న అధ్యక్షుడిగా పేరొందారు.

ట్రంప్‌కు ఇంత వయసు వచ్చినప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ నవ యువకుడిలాగే ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు హుషారుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడుగా తిరిగి రెండోసారి ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌… ఎట్టకేలకు మళ్లీ వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్‌ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్‌ వీడిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి

అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు షాక్‌.. ట్రంప్ ఏం చేశారంటే?

విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్ధుల మొదటి ఎంపిక అమెరికా. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇందులో భారతీయులు ముందుంటారు. ఒక్క భారత్‌నుంచే కాదు చాలా దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల సంఖ్యకు అమెరికా సర్కారు భారీగా కోత విధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41శాతం వీసా దరఖాస్తులను తిరస్కరించింది.

స్టూడెంట్ వీసా రద్దు.. అగ్రరాజ్యం నుంచి వెనక్కి.. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి..?

అక్రమ వలసదారులను వెతికి మరీ వెనక్కి పంపిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా ఓ విద్యార్థిని వీసాను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ విద్యార్థి రజనీ శ్రీనివాసన్‌ వీసాను అమెరికా రద్దు చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ భారతీయ విద్యార్థి హమాస్‌కు మద్దతు ఇస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఒక్క ఆర్డర్‌తో పాకిస్తాన్‌తో సహా 41 దేశాలకు షాకివ్వబోతున్న డోనాల్డ్ ట్రంప్..!

అమెరికా అధ్యక్షు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, డజన్ల కొద్దీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అంతర్గత మెమో సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.

మిమ్మల్ని నేను తీసుకొస్తా… సునీతకు ట్రంప్‌ సందేశం వీడియో

అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే వారు త్వరలోనే భూమిమీదకు రానున్నారని పలు మీడియా సంస్థల ద్వారా తెలుస్తోంది. సునీత కూడా మంగళవారం ఐఎస్‌ఎస్‌ నుంచి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే భూమి మీదకు చేరుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. మిమ్మల్ని సురక్షితంగా తీసుకురావడానికి వస్తున్నాం అని భరోసా ఇస్తూ.. వ్యోమగాములకు సందేశం పంపించారు.

అమ్మానాన్నతో వెళ్లిన.. లక్ష మంది మెడపై వేలాడే బహిష్కరణ కత్తి వీడియో

డిపెండెంట్‌ వీసా కింద అమెరికాకు వెళ్లిన వారిలో దాదాపు లక్ష మందికి పైగా భారతీయులు స్వీయ బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ యంత్రాంగం.. వీసా గడువు ముగిసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో హెచ్‌-1బీ వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు లక్ష మందికిపైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డిపెండెంట్‌ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లగా.. వీరి వయసు 21 ఏళ్లు నిండటమే తాజా ఆందోళనకు కారణం.

భారతదేశంపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్.. ఏప్రిల్‌ 2 నుంచి అమలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంటు)ను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగం ఇది. ప్రపంచం మొత్తం ట్రంప్ ప్రసంగాన్ని చూస్తోంది. ఈ తరుణంలో ఆయన సుంకాలపై సంచలన ప్రకటన చేశారు. తమ నుంచి ఎవరు సుంకాలు వసూలు చేసినా, వారి నుంచి సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

ఫలించని ‘శాంతి’ యత్నాలు.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్‌హౌస్‌ నుంచి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. ఉక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని.. జెలెన్‌ స్కీని “స్టుపిడ్‌ ప్రెసిడెంట్‌”అంటూ మండిపడ్డారు.

ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్‌..

అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ఏమాత్రం తగ్గడంలేదు. రోజురోజుకీ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే వేలాదిమంది అక్రమ వలసదారులను గుర్తించి ఆర్మీ ప్రత్యేక విమానాల ద్వారా వారివారి స్వస్థలాలకు పంపుతోంది. ఈ క్రమంలోనే.. అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమవలసదారులకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వార్నింగ్‌ ఇస్తూ టీవీల్లో యాడ్స్‌ ఇస్తోంది.

గ్రీన్ కార్డు కావాలా మావ.. ట్రంప్ అద్దిరిపోయే ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై.!

వలసదారులు అమెరికన్ పౌరసత్వం పొందటానికి కొత్త పథకాన్ని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఈ గోల్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ ప్రీమియం వెర్షన్ అవుతుందని భావిస్తున్నారు. గోల్డ్ కార్డ్ పథకం ద్వారా సేకరించిన డబ్బును అమెరికా ఆర్థిక లోటును తగ్గించడానికి ఉపయోగిస్తామని ట్రంప్ అన్నారు. రెండు వారాల్లో ఈ పథకం అమలులోకి రానుంది.

డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. 4 భారతీయ కంపెనీలపై నిషేధం!

ఈ కంపెనీల కార్యకలాపాల ద్వారా ఇరాన్ కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయి. నిషేధించిన నౌకలు వందల మిలియన్ల డాలర్ల విలువైన పది లక్షల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించేలా ఇరాన్ తన అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.