మిస్టర్ ఖమేనీ మాట విను.. మా బాటలో రా.. లేదంటే ఖతం.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్!
మిస్టర్ ఖమేనీ మాట విను.. అమెరికా బాటలో రా.. లేదంటే ఖతమైపోతావ్..! టక్కు టమరా మాటలు కాదు. అమెరికన్ వార్ బెల్.. ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్. మాట విన్నారా సరేసరి. లేదంటే స్మాష్ చేయడానికి అమెరికా రెడీ అనేది ట్రంప్ ఘాటు ట్వీట్ సారాంశం. మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి తన పోస్టులో ప్రస్తావించారు ట్రంప్.

Donald Trump Massive Armada Warning To Iran
ఇరాన్- అమెరికా మధ్య ఎనీ టైమ్ వార్.. ఆ స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సమయం లేదు ఖమేనీ..అంటూ ట్రంప్ హెచ్చరికల సైరన్ మోగించారు. యుద్దమా? శరణమా? తేల్చుకో అంటూ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
మిస్టర్ ఖమేనీ మాట విను.. అమెరికా బాటలో రా.. లేదంటే ఖతమైపోతావ్..! టక్కు టమరా మాటలు కాదు. అమెరికన్ వార్ బెల్.. ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్. మాట విన్నారా సరేసరి. లేదంటే స్మాష్ చేయడానికి అమెరికా రెడీ అనేది ట్రంప్ ఘాటు ట్వీట్ సారాంశం. మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ గురించి తన పోస్టులో ప్రస్తావించారు ట్రంప్. ఇప్పుడు కానీ మాట విని చర్చలతో సంధి బేరానికొస్తే మంచిది. లేదంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్‌కు మించి ఇరాన్ భారీ నష్టాలను కష్టాలను చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. సమయం లేదు మిత్రమా.. సంధికి చేసుకుందాం రా.. అని హితువు చెప్తూనే.. పంతాలకు పోతే అంతం తప్పదని గట్టిగా హెచ్చరించారు.
న్యూక్లియర్ వెపన్స్ వద్దు.. అందరికీ మంచి జరిగే ఒప్పందాలను ఒప్పుకోవడమే ముద్దు. ఇరాన్‌కు ఉన్న ఏకైక మార్గం మాట వినడమే. కాదు కూడదని కాలర్ ఎగరేసినా.. న్లూక్లియర్ వెపన్స్ ఉన్నాయని యుద్ధానికి కాలుదువ్వినా సరే ఇరాన్‌పై తాము చేపట్టే సైనిక చర్య మాములుగా ఉండదని ట్రంప్ అన్నారు. వెనుజులా చూశారా.. అది ట్రైలర్ మాత్రమే. ఇరాన్ కయ్యానికి కాలుదువ్వితే వెనిజులాకు మించిన సినిమా చూపిస్తామన్నారు. అవసరమైతే హింసతో ఆపరేషన్ ఫినిష్ చేస్తామని స్ట్రాంగ్ డోస్‌తో ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
ఔను నిజమే.. ఉత్తుత్తి మాటలు కాదు ట్రంప్ ఆదేశాలతో అమెరికన్ సేనలు ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ జెట్లు, డ్రోన్ల అమెరికన్ బలగాలు ఎనీ టైమ్ అటాకింగ్ సిద్దంగా ఉన్నాయి. అణుశక్తితో నడిచే భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్’ ఆధ్వర్యంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, దక్షిణ చైనా సముద్రం నుంచి నార్త్ అరేబియన్ సీ వైపు కదులుతోందని సమాచారం. దాదాపు 80 యుద్ధ విమానాలతో కూడిన ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, అమెరికా చేతుల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన యుద్ధ సాధనాల్లో ఒకటి. ఇప్పుడది ఇరాన్‌ను గురిపెట్టింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు ధీటుగా జవాబిచ్చిందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌పై ఎలాంటి దాడి జరిగినా అది పూర్తి స్థాయి యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
ఇరాన్ ఎలాంటి వ్యూహాలు పన్నినా సరే.. చివరకు తన మాట వినాల్సిందే. ఒప్పందాల బాటలోకి రావాల్సిందే అనేలా అమెరికా ఓవైపు యుద్ద పావులు కదుపుతోంది. మరోవైపు న్యూక్లియర్ వెపన్స్ వద్దు.. అందరికీ మంచి జరిగే మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యమని కలరింగ్ ఇస్తోంది. మాట విని అమెరికా బాటలోకి రా.. లేదంటే ఖతమే అంటూ ఖమేనీకి ట్రంప్ చేసిన హితువుతో కూడిన హెచ్చరికలు సంచలనంగా మారాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
