AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైట్ బాత్రూమ్‌లో సిగరెట్ కాలిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ హీరో ఒక్క ఫోన్ చేసి విడిపించారు: వీవీ వినాయక్

ఒకప్పుడు తెలుగులో ఊర మాస్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ వీవీ వినాయక్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కేవలం సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో మాత్రమే కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరో గురించి ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఫ్లైట్ బాత్రూమ్‌లో సిగరెట్ కాలిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ హీరో ఒక్క ఫోన్ చేసి విడిపించారు: వీవీ వినాయక్
Director VV Vinayak
Basha Shek
|

Updated on: Jun 14, 2026 | 8:09 AM

Share

వీవీ వినాయక్.. తెలుగులో ఊర మాస్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా ఆదితోనే బాక్సాఫీస్ ను షేక్ చేశారు వీవీ వినాయక్. ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, సాంబ, బన్నీ, లక్ష్మీ, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నెంబర్ 150.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు తెలుగు ఆడియెన్స్ కు అందించారీ సీనియర్ డైరెక్టర్. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు వీవీ వినాయక్. చివరిగా 2018లో ఇంటిలిజెంట్ అనే సినిమాను తీశారాయన. ప్రస్తుతం సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలో మాత్రమే కనిపిస్తున్నారు వీవీ వినాయక్. అలా తాజాగా వడ్డే నవీన్ నటించిన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారీ సీనియర్ డైరెక్టర్. ఈ సందర్భంగా హీరో నవీన్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారాయన.

‘వడ్డే నవీన్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను ఆయన సినిమాకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేశాను. నేను కో డైరెక్టర్‌గా చేసిన ఆఖరి చిత్రం వడ్డే నవీన్ దే. ఆయన సినిమాకి పని చేస్తున్న టైంలోనే నాకు ‘ఆది’ చిత్రం ఆఫర్ వచ్చింది. ఈయన సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడే నాకు జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయమైంది. అలా నవీన్ గారి సినిమాతోనే ‘ఆది’కి నాంది పలికినట్టు అయింది. ఓ సందర్భంలో నవీన్ గారి పరపతి చూసి నేను షాక్ అయ్యాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకొని వస్తుండగా, ఓ కాస్ట్యూమర్ ఫ్లైట్ బాత్ రూమ్ లో సిగరెట్ కాల్చాడు. చెన్నైలో ఫ్లైట్ ల్యాండ్ అవగానే పోలీసులు ఏకే-47 గన్స్ తో వచ్చి కాస్ట్యూమర్ ని అదుపులోకి తీసుకన్నారు. అప్పుడు నవీన్ గారు జస్ట్ ఒక్క కాల్‌ మాట్లాడి అతనిని విడిపించారు. అప్పుడే అర్థమైంది నవీన్ గారి ఇన్ ప్లూయెన్స్ గురించి. అయితే ఆయన వెళ్లాల్సిన స్థాయికి వెళ్లారని నేను అనుకోవడం లేదు. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన సినిమాలే చేయాలని కోరుకుంటున్నాను. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక  ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us