AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఒక్కసారి వింటే..

ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ఇందులోని పాటలే ప్రధాన కారణం. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా మంది యూట్యూబ్ లో ఈ పాటను చూస్తూనే ఉంటారు.

Trending Song: లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.. ఒక్కసారి వింటే..
Trending Song
Basha Shek
|

Updated on: Jun 12, 2026 | 9:10 PM

Share

కొన్ని సినిమా పాటలను ఎప్పటికీ మరవలేం. ముఖ్యంగా కొన్ని ప్రేమకథా చిత్రాల్లోని పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక మెలోడీ సాంగ్. 1999లో రిలీజైన ఓ ప్రేమకథా చిత్రంలోని ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంటుంది. పాటొచ్చి పాతికేళ్లయినా ఇప్పటికీ చాలా మంది ఈ సాంగ్ ను రిపీటెడ్ మోడ్ లో చూస్తుంటారు. ఈ సినిమా కథ కూడా దాదాపు నాగార్జున గీతాంజలి సినిమా స్టోరీని పోలీ ఉంటుంది. ఇందులో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. కానీ హీరోయిన్ కు ఓ నయం కాని జబ్బు ఉంటుంది. దీంతో హీరో బాగా కుమిలిపోతాడు. అలాగనీ తన ప్రియురాలిని విడిచిపెట్టడు. మరి అతను తన ప్రేమతో తన ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడదే ఈ సినిమా. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించడం విశేషం. అందుకే ఈ పాటకు మరింత అందమొచ్చింది. ముఖ్యంగా లవర్స్ కు ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోన్న ఆ పాట పేరు ‘నా హృదయంలో నిదురించే చెలి’.

ఇవి కూడా చదవండి

1999లో తెలుగులో రిలీజైన ప్రేమకథా చిత్రం ‘నా హృదయంలో నిదురించే చెలి’. దర్శకుడు ఏవీఎస్ ఆదినారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో వడ్డే నవీన్, లైలా హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే చలపతి రావు, సుధ, సుధాకర్, రమా ప్రభ, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ ప్రేమ కథా చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. అందులోనూ ఈ సినిమా టైటిల్ సాంగ్ అయితే టేప్ రికార్డర్లలో మార్మోగిపోయింది. కొన్నేళ్ల పాటు ఈ పాట హల్ చల్ చేసింది. ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించారు. అలాగే చంద్రబోస్, వెన్నెలకంటి సాహిత్యం అందించారు. అప్పట్లో ఈ సినిమా ఆడియో ప్రమోషన్ సమయంలో, ప్రతి ఆడియో క్యాసెట్‌తో ప్రేమ సూక్తులు ఉన్న నోట్‌ప్యాడ్‌ను ఉచితంగా ఇవ్వడం విశేషం. అంతలా ఆదరణకు నోచుకున్నాయి ఈ సినిమా పాటలు. మరి ఎవర్ గ్రీన్ మెలొడీ సాంగ్స్ లో ఒకటైన ‘నా హృదయంలో నిదురించే చెలి’ సాంగ్ ను మీరూ చూశారా? చూడకపోతే యూట్యూబ్ లో చూసేయండి.

‘నా హృదయంలో నిదురించే చెలి’ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us