Telangana: గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామం మసీదు సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగంతో వచ్చిన ఓ కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గరు మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామం మసీదు సమీపంలోకి రాగానే అదుపుతప్పి పక్కనే రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్దుడిని ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న మరో ఇంట్లోకి దూసుకెళ్లి.. అక్కడున్న కుటుంబ సభ్యులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వృద్దుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. క్రెన్ సహాయంతో కారును బయటకు తీసి.. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఓ చిన్నారి ఉన్నట్టు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన కందుగుల రాధవ్వ, కెమ్మసారం లక్ష్మిగా గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
