బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం సైతం అధికంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి
TV9 Telugu
ఇవి బీపీని నియంత్రించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి
TV9 Telugu
బాగా పండిన అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్ మాదిరిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ పండ్లను తింటే అసిడిటీ తగ్గిపోతుంది
TV9 Telugu
జీర్ణాశయ గోడలపై ఉండే మ్యూకస్ పొర రక్షించబడుతుంది. దీంతో కడుపులో మంట, గుండెల్లో మంట, అజీర్తి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
బాగా పండిన అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఒక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది
TV9 Telugu
సెరొటోనిన్ ఒక న్యూరోట్రాన్స్‌మిటర్. ఇది మూడ్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేస్తుంది
TV9 Telugu
మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. దీంతో మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటారు. బాగా పండిన అరటి పండ్లు శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది
TV9 Telugu
ఈ పండ్లలో ఉండే చక్కెరలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. దీంతో తక్షణమే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. ఉత్తేజంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు