AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయస్వామి తన కాన్వాయ్‌ను ఆపి రోడ్డుపై ఉన్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. తల్లికి వందనం పథకం కింద డబ్బులు వచ్చాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఒక విద్యార్థికి డబ్బులు రాలేదని తెలుసుకున్న వెంటనే అధికారులతో విచారణ చేయాలని ఆదేశించారు. ఈ ఆప్యాయ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
Ap Minister Dola Sree Bala Veeranjaneya Swamy
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 26, 2026 | 7:07 PM

Share

ప్రకాశం జిల్లాలో మంత్రి బాలవీరాంజనేయస్వామికి అరుదైన అనుభవం ఎదురైంది. కొండపి నుంచి మర్రిపూడి వైపు వెళుతుండగా మార్గ మధ్యంలో కొంతమంది చిన్నారులు టపాసులు పేలుస్తూ కనిపించడంతో మంత్రి కారును ఆపారు. చిన్నారులను పిలిచి అబ్బాయిలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందులో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్ధులు ఉన్నారు. మంత్రి స్వామిని గుర్తు పట్టిన ఆ చిన్నారులు సంతోషంతో ఆయనతో మాటలు కలిపారు. అబ్బాయిలు ఇక్కడేం చేస్తున్నార్రా..? అంటూ మంత్రి స్వామి ఆప్యాయంగా ప్రశ్నించారు.. దీంతో సమాధానం ఇచ్చిన చిన్నారులు.. మీరు వస్తున్నారని టపాసులు పేలుస్తున్నామని బాలురు చమత్కరించారు. దీంతో అరే, అంటూ మంత్రి ఆశ్చర్యపోతూనే వాళ్ళు చేతుల్లో ఉన్న అగ్గిపెట్టెలతో జాగ్రత్త చేతులు కాలుతాయని మంత్రి జాగ్రత్తలు చెప్పారు.

ఈ సందర్బంగా తల్లికి వందనం డబ్బులు వచ్చాయా..? అని చిన్నారులను ప్రశ్నించారు.. తమ తల్లుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చిన్నారులు సమాధానం ఇచ్చారు. ఓ విద్యార్ధి మాట్లాడుతూ.. తమ ఇంట్లో 39 వేలు పడ్డాయని ఆనందంగా చెప్పాడు. చివరిలో ఓ విద్యార్ధి తనకు తల్లికి వందనం డబ్బులు రాలేదని చెప్పడంతో వెంటనే స్పందించిన మంత్రి స్వామి తన సిబ్బందిని పిలిచి ఆ విద్యార్ధి డబ్బులు రాలేదంటున్నాడు.. ఏంటో విచారించి తనకు చెప్పాలని ఆదేశించారు. రోడ్డుపై చిన్నారులతో మంత్రి ఆసక్తిగా ముచ్చటించిన సంభాషణలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!