AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేస్తోంది.. టైమింగ్స్ ఫిక్స్..!

Vande Bharat Express: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రైలును పట్టాలెక్కించే అవకాశముందని సమాచారం. విశాఖపట్నం-తిరుపతి మధ్య ఈ రైలు ప్రయాణం సాగించనుంది. ప్రస్తుతం షెడ్యూల్ వివరాలు బయటకొచ్చాయి.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేస్తోంది.. టైమింగ్స్ ఫిక్స్..!
Tirumala
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2026 | 7:37 PM

Share

ఏపీ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో వందే భారత్ రైలును నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలపనుంది. ప్రస్తుతం ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్లు రాష్ట్రంలో వివిధ నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కనుంది. కీలకమైన నగరాలుగా ఉన్న విశాఖపట్నం-తిరుపతి మధ్య ఈ రైలు నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ రైలు పగటిపూట నడపనున్నారని తెలుస్తుండగా.. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షెడ్యూల్ వివరాలు ఇవే..?

విశాఖపట్నం-తిరుపతి వందే భారత్ రైలు విశాఖలో ఉదయం 5.35 గంటలకు బయల్దేరుతుండగా.. మధ్యాహ్నం 2.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలుస్తుంది. అలాగే తిరుపతి-విశాఖపట్నం ట్రైన్ తిరుపతిలో మధ్యాహ్నం 2.55 గంటలకు బయల్దేరి విశాఖపట్నంకు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఈ రైలు స్టాపుల విషయానికొస్తే.. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో ఆగుతుందని సమాచారం. అయితే షెడ్యూల్, స్టాపుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే రైల్వేశాఖ వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గతంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి సీఎం చంద్రబాబు.. విశాఖ-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని, వందే భారత్ రైలు నడపాలని కోరారు. దీనికి అప్పట్లోనే రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారు.

తిరుమల వెళ్లే భక్తులకు ఊరట

ఈ వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి పండుగగా చెప్పవచ్చు. తిరుపతికి మరో వందే భారత్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. దీని వల్ల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారు ఈ రైలు ద్వారా వేగంగా చేరుకోవచ్చు. ఈ రైలు ద్వారా కేవలం 8.45 గంటల్లోనే విశాఖ-తిరుపతి మధ్య ప్రయాణించే సౌకర్యం రానుంది. అయితే విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది తిరుపతిగా మీదుగా వెళ్లే అవకాశముంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలో ఉండగా.. రాబోయే రోజుల్లో పట్టాలెక్కు ఛాన్సుంది. దీని వల్ల రాత్రి వేళల్లో తిరుపతికి ప్రయాణం చేసేవారు హాయిగా, సౌకర్యవంతంగావెళ్లవచ్చు. ప్రస్తుత బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ఏపీ మీదుగా వెళుతుంది. అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఆగుతుంది.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!