పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి. కొణవలస ఘాట్ రోడ్డులో ఘోర లారీ ప్రమాదం జరిగింది. మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కొండను ఢీకొనడంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో సాలూరు ఆస్పత్రికి తరలించారు.