AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీటెయిల్స్!

హైదరాబాద్‌ నుంచి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్ - మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేసింది.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక ట్రైన్‌లు.. ఇదిగో ఫుల్‌ డీటెయిల్స్!
Hyderabad To Mangaluru Special Train
Anand T
|

Updated on: Jul 26, 2026 | 3:54 PM

Share

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఈసారి హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడిపిన ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన (రెస్పాన్స్) వచ్చింది. అలాగే ఈ రూట్‌లో సేవులను మరికొంత కాలం కొనసాగించాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌, మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల రాకపోకలను మరో ఐదు ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది.

ప్రత్యేక రైలు వేళలు, తేదీల వివరాలు:

  • రైలు నంబర్ 07097 (హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్): ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది.

  • రైలు నంబర్ 07098 (మంగళూరు సెంట్రల్ – హైదరాబాద్): ఆగస్టు 6, 13, 20, 27 సెప్టెంబరు 3వ తేదీలలో మంగళూరు నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వస్తుంది.

కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

నిలిచే ప్రధాన స్టేషన్లు:

ఈ రెండు ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకలోని ప్రధాన స్టేషన్ల గుండా రాపోకలు సాగిస్తాయి. అలాగే బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణరాజపురం, సేలం, పాలక్కాడ్, కోళికోడ్, వడకర, కాసర్‌గోడ్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక ట్రైన్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరణం తర్వాత ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగించరు? గరుడ పురాణం..
మరణం తర్వాత ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగించరు? గరుడ పురాణం..
ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో పాస్
ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో పాస్
ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే
బిగ్‌బాస్‌ 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌ 10 రెండో కంటెస్టెంట్‌గా త్రిగుణ్.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..
ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..
దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
దేబ్జానీ మోదక్ బ్యాగ్రౌండ్ ఇదే
రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా?
రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా?
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
కలలో బంగారం, డబ్బు లేదా వెలుగు కనిపిస్తే ఏం జరుగుతుంది? సంపద రాక
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
మీ ఐఫోన్ బ్యాటరీని ఏ యాప్ ఎక్కువగా తీసుకుంటుంది? తెలుసుకోండిలా?
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!
ఎయిర్ షోలో కుప్పకూలిన F-4 యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి!