పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఎలా..?

Venkatrao Lella

Images: Pinterest

26 SEP 2026

చాలామంది తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీలోకి బదిలీ చేసుకోరు. దీని వల్ల పీఎఫ్ విత్ డ్రా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది

ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ మీరు బదిలీ చేసుకోకపోతే కొత్త కంపెనీ జమ చేసే చందా ప్రత్యేక ఖాతాలోకి వెళతాయి. పాత పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను మీరు కొత్త కంపెనీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది

మీరు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పాత పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌ను కొత్త అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత పీఎఫ్ ఖాతా, పాత పీఎఫ్ అకౌంట్ రెండూ ఒక యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలి.

ఇక బ్యాలెన్స్ బదిలీ చేసేముందు కేవైసీ వివరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ వంటి సమాచారం కరెక్ట్‌గా ఉన్నాయో.. లేదో చూసుకోండి.. ఏదైనా పొరపాటు ఉంటే అప్డేట్ చేసుకోండి..

పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ముందుగా యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి. ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఒకే సభ్యుడు-ఒకే ఈపీఎఫ్ ఖాతా ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ పాత పీఎఫ్ అకౌంట్, ప్రస్తుత అకౌంట్ ఖాతా వివరాలను సరిచూసుకోండి. పాత పీఎఫ్ అకౌంట్‌ను ఎంచుకుని అవసరమైన సమాచారం నమోదు చేయండి. ఆ తర్వాత క్లెయిమ్ సమర్పించండి.

ఆ తర్వాత పీఎఫ్ అధికారులు పరిశీలించి మీ వివరాలను ధృవీకరిస్తారు. అనంతరం మీ పాత పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తం కొత్త ఖాతాలోకి చేరుతుంది.

బదిలీ చేసుకోవడం వల్ల పీఎఫ్ బ్యాలెన్స్, చెల్లింపులు, బదిలీ, వడ్డీ సమాచారం మొత్తం ఒకేచోట సరిచూసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ వివరాలను సరిచేసుకోవడం సులభం అవుతుంది.

క్లెయిమ్ సమర్పించిన తర్వాత మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌లోకి వెళ్లి ట్రాక్ చేయవచ్చు. కొత్త కంపెనీలో  చేరినప్పుడు తప్పనిసరిగా ఈ పని పూర్తి చేయాలి.