డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల లాయర్ డేటింగ్ యాప్ పరిచయం ద్వారా సైబర్ నేరగాళ్ల బ్లాక్‌మెయిల్‌కు గురై రూ.4.91 కోట్లు కోల్పోయినట్లు కథనం పేర్కొంది. ప్రైవేట్ చాట్స్, ఫొటోలు, వీడియోల పేరుతో బెదిరింపులు ఎదురవడంతో మొదట చిన్న మొత్తాల్లో డబ్బులు పంపాడు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యుల సొమ్ము, చివరకు సొంత ఫ్లాట్ అమ్మిన డబ్బును కూడా 241 లావాదేవీల్లో బదిలీ చేసినట్లు సమాచారం. అనంతరం సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
హాయ్ .. హల్లో .. అంటూ మంచిగా మాట్లాడి వలపు వలలోకి దింపుతారు.. అలాంటి వాటి జోలికి వెళ్లొద్దు.. అవన్నీ పచ్చి మోసాలు.. బీకేర్‌ఫుల్.. అంటూ పదే పదే హెచ్చరిస్తున్నా.. కొంత మంది అస్సలు వినరు.. చివరకు అన్నీ కోల్పోయాక లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంటారు.. తాజాగా.. “డేటింగ్ యాప్‌లో ఓ చిన్న పరిచయం… సాధారణంగా మొదలైన చాటింగ్… కట్ చేస్తే, తన సొంత ఫ్లాట్‌ను అమ్మేసి, ఏకంగా 4.91 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నాడు ఒక హైదరాబాద్ యువకుడు! బాధితుడు సాధారణ వ్యక్తేమీ కాదు… చట్టాలు తెలిసిన ఒక 27 ఏళ్ల లాయర్! మరి అంత పెద్ద చదువు చదివిన లాయర్ కూడా ఈ ప్లాన్‌లో ఎలా చిక్కుకున్నాడు? ఏకంగా 241 ట్రాన్సాక్షన్లు చేసేంత వరకు ఏం జరిగింది? ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సంచలన నిజం ఇది! “ఈ కథ హైదరాబాద్ నగరంలో మొదలైంది. డేటింగ్ యాప్‌లో బాధితుడికి ఒక ప్రొఫైల్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో అంతా చాలా సాధారణంగా, ఫ్రెండ్లీగా సాగింది. గంటల తరబడి చాటింగ్ చేసుకునేవారు. అయితే, క్రమంగా ఆ సంభాషణ వ్యక్తిగత విషయాలు, ప్రైవేట్ చాట్స్, ప్రైవేట్ వీడియో కాల్స్ వరకు వెళ్లింది. అవతలి కిలాడీ లేడీని పూర్తిగా నమ్మిన ఆ యువకుడు తన వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకున్నాడు. ఇంకెముంది .. కట్ చేస్తే.. సైబర్ నేరగాళ్ళు తమ అసలు స్కెచ్ బయటపెట్టారు! ఆ ప్రైవేట్ చాట్లు, ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులు స్టార్ట్ చేశారు! “ఇక్కడే అసలైన ట్రాప్ ఉంది! ‘పరువు పోతుంది, కుటుంబ గౌరవం దెబ్బతింటుంది’ అనే భయంతో బాధితుడు మొదట చిన్న మొత్తాల్లో డబ్బులు పంపడం ప్రారంభించాడు. ఒక్కసారి డబ్బు ఇస్తే ఈ గొడవ వదిలిపోతుందిలే అనుకుంటే అది వారి ఆశ మాత్రమే! డబ్బులు చూసిన నిందితులు ప్రతిసారీ కొత్త కారణాలు చెప్తూ డిమాండ్లు పెంచేశారు. దీంతో చేసేదేంలేక.. బాధితుడు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న సొమ్మంతా బదిలీ చేశాడు. అదీ చాలకపోవడంతో… తన కుటుంబ సభ్యుల అకౌంట్లలో ఉన్న డబ్బును కూడా పంపేశాడు. నిందితుల ఒత్తిడి తట్టుకోలేక, చివరకు తనకు ఉన్న సొంత ఫ్లాట్‌ను అమ్మేసి ఆ డబ్బును కూడా వారికే బదిలీ చేశాడు! ఇలా ఏకంగా 241 లావాదేవీల్లో మొత్తం అక్షరాల 4కోట్ల 91 లక్షలు పంపేశాడు! అయినా బెదిరింపులు ఆగకపోవడంతో, తాను ఎంత పెద్ద స్కామ్ లో చిక్కుక్కున్నాడో అర్థమై సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. అందుకే… సైబర్ నిపుణులు తరచుగా క్లియర్ కట్‌గా హెచ్చరిస్తున్నారు: అపరిచితులతో ప్రైవేట్ చాట్స్ వద్దు: డేటింగ్ యాప్‌లలో ఎంత పరిచయం ఉన్నా సరే, మీ ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు లేదా పర్సనల్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. బ్లాక్‌మెయిలర్లకు రూపాయి కూడా ఇవ్వకండి: ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తే డబ్బులు ఇవ్వడం వల్ల సమస్య తీరదు… వారి ఆశ మరింత పెరుగుతుంది! భయపడకుండా కంప్లైంట్ చేయండి: పరువు పోతుందనే భయాన్ని పక్కనపెట్టి వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. ఈ డిజిటల్ యుగంలో ఒక చిన్న పొరపాటు మన జీవిత కాల సంపాదనను తుడిచిపెట్టేస్తుంది.. ఇక కుటుంబం చిన్నాభిన్నమవుతుంది.. బీకేర్‌ఫుల్ ఫ్రెండ్స్.. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Depression: ఫేక్ నవ్వు వెనుక దాగిన బాధ.. మనసు మాట వినండి బ్రో.. నువ్వు డిప్రెషన్‌ను జయిస్తావు
Pink Power Run 3.0: హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 3.0కి భారీ స్పందన
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

