గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు.. ఎక్కడో తెలుసా?

September 25, 2026

Subhash

కొన్ని గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్లు రూ.200 నుంచి రూ.600 వరకు తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే ఈ తగ్గింపు దేశవ్యాప్తంంగా కాదు.

సిలిండర్

యూపీలోని కుషినగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణీత ధర కంటే తక్కువకు వాణిజ్య సిలిండర్లను కొన్ని గ్యాస్ ఏజెన్సీలు విక్రయిస్తున్నాయి. స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఈ డిస్కౌంట్.

ఎక్కడ లభిస్తోంది?

కుషినగర్‌లో 19 కేజీలసిలిండర్ నిర్ణీత ధర రూ.2,946గా ఉంది. కొన్ని ఏజెన్సీల వద్ద సుమారు రూ.2,400 నుంచి రూ.2,700 మధ్య లభిస్తున్నాయి. పరిస్థితిని బట్టి రూ.200 నుంచి రూ.600 వరకు తక్కువ.

ఎంత ధరకు

దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 22 నాటికి 14.2 కేజీల గృహ వినియోగ LPG సిలిండర్ ధర రూ.942గా ఉంది. అదే సమయంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,747.50గా ఉంది. 

ఢిల్లీలో

ఈ తగ్గింపును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల డిస్కౌంట్ కాదు. గ్రామీ ప్రాంతాల్లో ఈ సిలిండర్లకు డిమాండ్ తక్కువగా ఉండి అదనపు స్టాక్ పేరుకుపోయింది. 

ఎందుకు తగ్గిస్తున్నారు?

19 కేజీల వాణిజ్య LPG సిలిండర్లను ప్రధానంగా రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారాలు ఉపయోగిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తక్కువగా ఉండటంతో ఏజెన్సీల వద్ద నిల్వలు పెరిగినట్లు సమాచారం.

LPG

సిలిండర్లను తీసుకొచ్చే వాహనం ఖాళీ సిలిండర్లతోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. వినియోగం తక్కువగా ఉండటంతో సరఫరా సజావుగా కొనసాగేందుకు కొన్ని చోట్ల తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

సరఫరా

గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ వ్యవధిని 25 రోజులకు తగ్గించారు.

మరో కీలక మార్పు