AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఆదివారం ఏయే బ్యాంకులు తెరిచి ఉంటాయి..? ప్రైవేట్ బ్యాంకులు ఉండవా..?

సెప్టెంబర్ 27న బ్యాంకులు తెరిచి ఉండనున్నాయి. ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు ఓపెన్ కానున్నాయి. సాధారణంగా ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం ఆదివారం బ్యాంకులకు సెలవు. కానీ 28 నుంచి 30 వరకు బ్యాంకులు సమ్మె కారణంగా మూతపడనున్నాయి. దీంతో రేపు బ్యాంకులు తెరిచి ఉంచనున్నారు.

Bank Holidays: ఆదివారం ఏయే బ్యాంకులు తెరిచి ఉంటాయి..? ప్రైవేట్ బ్యాంకులు ఉండవా..?
Bank Holiday
Venkatrao Lella
|

Updated on: Sep 26, 2026 | 7:57 PM

Share

బ్యాంకింగ్ ఖాతాదారులకు భారీ ఊరట. సెప్టెంబర్ 27వ తేదీన ఆదివారం బ్యాంకులు మూతపడనున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో ఆ మూడు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. దీని వల్ల బ్యాంక్ ఖాతాదారులు సేవలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ క్రమంలో ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంచాలని కేంద్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ కూడా ఆర్డర్స్ పాస్ చేసింది. వరుసగా మూడు రోజుల పాటు బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివేసే అవకాశం ఉన్న క్రమంలో వినియోగదారులు ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు ఆదివారం తెరిచి ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది.

ఆదివారం బ్యాంకులు ఓపెన్

ఆదివారం తెరకపోతే వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడి ఉండేవి. సెప్టెంబర్ 26వ తేదీన నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. 28 నుంచి 30 వరకు సమ్మె కారణంగా ప్రభావితం కానున్నాయి. ఇక ఆదివారం కూడా సాధారణ సెలవు కావడంతో బ్యాంకులు వరుసగా ఐదు రోజుల పాటు మూతపడేవి. కానీ ఆర్ధికశాఖ ఆదేశాలతో ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంచనుండటంతో మధ్యలో ఒకరోజు ఊరట కలిగింది. ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించాలని ఆర్బీఐ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బ్యాంకులు రేపు తెరిచి ఉంచనుండగా.. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉండవు. దీంతో బ్రాంచ్‌లతో అవసరం ఉన్నవారు ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

ఏయే బ్యాంకులు తెరిచి ఉంటాయి..?

ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, భారతీయ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు గ్రామీణ బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఈ కార్యాలయాలతో పాటు ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు, ఇతర బ్యాంకింగ్ సదుపాయాలు పనిచేస్తాయి. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా తెరిచే ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రమే ఆదివారం మూతపడతాయి. సమ్మెకు ముందే ముఖ్యమైన లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. సమ్మె రోజుల్లో ఏటీఎంలు, ఇంటర్నెట్, మొబైల్, యూపీఐ బ్యాంకింగ్ వంటి సేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి. కాగా వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకపోతే వచ్చే నెల నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Follow Us