AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 7.9 రేటింగ్

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆడియెన్స్ ను భయపెడుతూ మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు ఐఎండీబీలోనూ 7.9 రేటింగ్ రావడం గమనార్హం.

OTT Movie: ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో మిస్టరీ థ్రిల్లర్.. IMDBలో 7.9 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 26, 2026 | 7:56 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషలకు చెందని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక, నయనతార హాయ్ తదితర సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటే స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ సర్వైవల్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లో దుమ్ము రేపుతోంది. రికార్డు వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇదొక ఫారెస్ట్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఆడియెన్స్ ను బాగా భయపెడుతూ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. ఈ సినిమా స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దట్టమైన అడవి చుట్టూ సాగే ఓ మిస్టరీ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. తన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదనే తీవ్ర అసంతృప్తితో ఉంటాడు వీరా అనే ఫోటోగ్రాఫర్. కెరీర్‌లో ఇంకా ఏదైనా పెద్దది సాధించాలని ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలోనే అతనికి ‘మ్యాథికెట్టన్ సోలై’ అనే సీక్రెట్ ఫారెస్ట్ రిజర్వ్ గురించి తెలుస్తుంది. ఆ అడవిలోని రహస్య మిస్టరీని తన కెమెరాలో బంధించి పాపులర్ అవ్వాలనుకుంటాడు. అయితే ఆ అడవిలోకి వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒంటరిగానే ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతాడు. మరి ఆ తర్వాత వీరాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతను అనుకున్న లక్ష్యం నెరవేరిందా? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ఫొటోగ్రాఫర్ (Photographer). మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి అష్రఫ్ దర్శకత్వం వహిస్తూనే హీరోగానూ నటించాడు. ఆయనతో పాటు కరుణాకరన్, జనని సామంతనం, కలట్ పడై, ఆడుకాలం నరేన్, దేవి మహేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఫొటో గ్రాఫర్ సినిమా కేవలం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఫొటో గ్రాఫర్ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us