AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో కలెక్షన్ల వర్షం.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ తీరా థియేటర్లలో రిలీజయ్యాక ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: థియేటర్లలో కలెక్షన్ల వర్షం.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 26, 2026 | 6:45 AM

Share

ఈ మధ్యన కొన్ని సినిమాలు ఆడియెన్స్ అంచనాలకు అందట్లేదు. హిట్ అవ్వాల్సిన సినిమాలు అనూహ్యంగా బోల్తా పడుతున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా రిలీజైందని కూడా చాలా మందికి తెలియదు. అయితే తీరా థియేటర్లలో రిలీజయ్యాక ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ.45 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఓవరాల్ గా రూ.213 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. నిర్మాతలు పెట్టిన బడ్జెట్‌కి నాలుగింతల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

బాలీవుడ్ కిస్సింగ్ హీరో ఇమ్రాన్ హష్మి నటించిన లేటెస్ట్ సినిమా ‘అవారపన్’. 2007లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత కాలంలో కల్ట్ క్లాసిక్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన సినిమానే ‘అవారపన్ 2’. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా కలెక్షన్లను సాధించింది. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అవారపన్ 2’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (సెప్టెంబర్ 25) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. నితిన్ కక్కర్ తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు శ్రియా శరణ్, షబానా అజ్మీ, విజయంత్ కోహ్లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కేవలం రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

అవారాపన్ 2 సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!