AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య వయసుపై ట్రోలింగ్.. ఆధార్ కార్డ్ చూపించి మరీ కౌంటరిచ్చిన ‘బేబీ’ హీరోయిన్

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ తారలపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. సినిమాలతో పాటు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై కూడా కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అలా ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య వయసుపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. తాజాగా వీటిపై స్పందించిన ఆమె ఆధారాలతో సహా ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య వయసుపై ట్రోలింగ్.. ఆధార్ కార్డ్ చూపించి మరీ కౌంటరిచ్చిన 'బేబీ' హీరోయిన్
Vaishnavi Chaitanya
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 7:53 PM

Share

టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న హీరోయిన్లలో వైష్ణవి చైతన్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. షార్ట్‌ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట చిన్న చితకా పాత్రలు చేసింది. అలా వైకుంఠపురంలో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను తదితర సినిమాల్లో వైష్ణవి సహాయక నటిగా మెప్పించింది. ఇక బేబీ మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిందీ అందాల తార. ఈ సినిమాలో నటనతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిందీ అందాల తార. సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత లవ్ మీ, జాక్ సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఇటీవలే ఎపిక్ అనే సినిమాతో ఆడియెన్స్ ను పలకరించింది వైష్ణవి. బేబీ హీరో ఆనంద్ దేవరకొండ ఇందులో హీరోగా నటించాడు. సెప్టెంబర్ 11న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కాగా ఎపిక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చింది వైష్ణవి. ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుది. ఇదే సందర్భంగా తన వయసు గురించి వస్తున్న రూమర్స్‌కు వైష్ణవి చైతన్య చెక్ పెట్టింది.

ఇంటర్వ్యూలో భాగంగా ఒక పాత్రలో కొన్ని చీటీలు ఉంచి వాటిలో ఒక్కొక్క దానిని సెలెక్ట్ చేసుకోమని యాంకర్ వైష్ణవికి ఇచ్చింది. వికిపీడియా ప్రకారం మీ వయసు 32 సంవత్సరాలు అని ఉంది. అయినప్పటికీ మీరు 25 ఏళ్ల అమ్మాయిలా యంగ్‌గా కనిపిస్తున్నారు.. ఇలా ఉండేందుకు మీ బ్యూటీ సీక్రెట్ ఏంటని యాంకర్ ప్రశ్నించింది. దీనికి వైష్ణవి ఇలా స్పందించింది. ‘వికిపీడియాలో నా వయసు గురించి ఉన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. అందులో చెప్పినట్లు నా బర్త్ ప్లేస్ కూడా కరెక్ట్ కాదు. నా వయసు 25 ఏళ్లు మాత్రమే’ అని ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది వైష్ణవి. ఇక ఇదే ఇంటర్వ్యూలో భాగంగా ఒక గేమ్‌‌లో మీ ఆధార్ కార్డ్ ఫోటో చూపించమని యాంకర్ అడగ్గా వెంటనే తన మొబైల్ లో ఉన్న ఆధార్ ఫొటో చూపించింది వైష్ణవి. అందులో తను పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. ప్రస్తుతం వైష్ణవి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏజ్ ఎంతో తెలుసా?
'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఏజ్ ఎంతో తెలుసా?
కొత్త ఫించన్లపై గుడ్‌న్యూస్.. మరోసారి గడుపు పెంచిన ప్రభుత్వం
కొత్త ఫించన్లపై గుడ్‌న్యూస్.. మరోసారి గడుపు పెంచిన ప్రభుత్వం
కలలో కాకి కనిపిస్తే ఏంటి అర్థం? శుభ, అశుభ సంకేతాలు ఇవే!
కలలో కాకి కనిపిస్తే ఏంటి అర్థం? శుభ, అశుభ సంకేతాలు ఇవే!
మాజీ DSP భీమ్‌రెడ్డి కేసులో బినామీలపై ఏసీబీ ఫోకస్..!
మాజీ DSP భీమ్‌రెడ్డి కేసులో బినామీలపై ఏసీబీ ఫోకస్..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో