హనుమాన్ బ్యూటీ అమృత అయ్యర్ సైలెంట్ అయిపోయిందే 

29 November 2026

Rajeev Rayala 

అమృత అయ్యర్ తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

చెన్నైలో జన్మించిన ఈ బ్యూటీ బెంగళూరులో పెరిగింది. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదువుకుంది.

2018లో వచ్చిన తమిళ సినిమా 'పడైవీరన్'తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 దళపతి విజయ్ నటించిన 'బిగిల్' సినిమాలో థెండ్రల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  రామ్ పోతినేని హీరోగా నటించిన 'రెడ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

 ప్రదీప్ మాచిరాజు నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో అక్షర పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది.

  'అర్జున ఫల్గుణ' సినిమాలో నటించి తన అభినయంతో ఆకట్టుకుంది.  తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది.

 2024లో వచ్చిన అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి' సినిమాలో కావేరి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.