పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!
హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని సినిమాలు పగలు చూడాలన్నా వణుకు పుట్టిస్తాయి. అలా ఒంటరిగా చూడటానికి అస్సలు సాహసించలేని, అత్యంత భయానకమైన హారర్ థ్రిల్లర్ మూవీ లిస్టులో ఈ మూవీ కూడా టాప్ లోనే ఉంటుంది. ఆ సినిమా ఏంటి ? ఆ మూవీ స్టోరీ, ఓటీటీ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భయపడుతూనే తెగ ఎంజాయ్ చేసే మూవీ లవర్స్ కోసం ఓటీటీల్లో ఎన్నో థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు పగలు చూడాలన్నా వణుకు పుట్టిస్తాయి. అలా ఒంటరిగా చూడటానికి అస్సలు సాహసించలేని, అత్యంత భయానకమైన హారర్ థ్రిల్లర్ మూవీ లిస్టులో ఈ మూవీ కూడా టాప్ లోనే ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఆ సినిమా ఏంటి ? ఆ మూవీ స్టోరీ, ఓటీటీ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఆ మూవీ ఇదే..
అర్జెంటీనాకు చెందిన ఈ స్పానిష్ హారర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా హారర్ ప్రియులను వణికించింది. డెమియన్ రుగ్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎజెక్వియెల్ రోడ్రిగ్జ్, డెమియన్ సలోమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. స్పానిష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉండటం విశేషం.
కథ విషయానికొస్తే..
అదొక మారుమూల పల్లెటూరు. పెడ్రో, జిమ్మీ అనే ఇద్దరు అన్నదమ్ములు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఒకరోజు వీరికి సమీపంలోని అడవిలో ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం దగ్గర ఒక ముసలామె ఫోటో, అడ్రస్ దొరుకుతాయి. ఆరా తీయగా.. ఆ ముసలామె కొడుకుకు ఒక భయంకరమైన దయ్యం ఆవహించిందని, అతని శరీరం ద్వారా అది ఈ ప్రపంచంలోకి పునర్జన్మ ఎత్తడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
అయితే ఆ దుష్టశక్తి బయటకు రాకముందే దాన్ని ఊరి నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని ఆ అన్నదమ్ములు ప్రయత్నిస్తారు. కానీ వారి ఆలోచనే పెను ప్రమాదంగా మారుతుంది. ఆ దయ్యం ఒక అంటువ్యాధిలా మనుషులకు, జంతువులకు వ్యాపించడం మొదలుపెడుతుంది. పెడ్రో తన మాజీ భార్య సబ్రినా, పిల్లలను ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడుకోవాలని ప్రయత్నిస్తుండగా ఊహించని దారుణాలు జరుగుతాయి. ఇంట్లోని పెంపుడు కుక్క దయ్యం ప్రభావంతో సబ్రినా కూతురిపై దాడి చేయడం.. చనిపోయిన ఆమె మళ్లీ దయ్యంగా బతికి రావడం వంటి సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
ఇక చివరికి ఆ అన్నదమ్ములు తమ పిల్లలను కాపాడుకోగలిగారా? ఆ దుష్టశక్తి పునర్జన్మ ఎత్తకుండా అడ్డుకోగలిగారా? అసలు ఆ దయ్యం బారి నుంచి తప్పించుకోవడానికి ఉన్న నియమాలేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సాధారణ దయ్యం సినిమాల్లా కాకుండా.. అత్యంత క్రూరమైన సన్నివేశాలు ఇందులో ఉంటాయి. అందుకే సున్నిత మనస్కులు, చిన్నపిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండటమే మంచిది. నిజమైన హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు!
