AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల భైరవ అష్టమి.. డిసెంబర్ 1న ఈ 5 ఆచారాలు పాటిస్తే భైరవుడి అనుగ్రహం లభిస్తుందట!

Kaal Bhairav Ashtami 2026 Telugu: 2026 డిసెంబర్ 1న కాల భైరవ జయంతిని జరుపుకోనున్నారు. శివుని ఉగ్రరూపమైన కాల భైరవుడిని ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆవనూనె దీపం వెలిగించడం, నల్ల కుక్కకు ఆహారం పెట్టడం, నల్ల నువ్వులు దానం చేయడం వంటి 5 ప్రత్యేక ఆచారాల గురించి వివరంగా తెలుసుకోండి.

కాల భైరవ అష్టమి.. డిసెంబర్ 1న ఈ 5 ఆచారాలు పాటిస్తే భైరవుడి అనుగ్రహం లభిస్తుందట!
Kaal Bhairav Jayanti 2026
Rajashekher G
|

Updated on: Nov 29, 2026 | 9:09 PM

Share

Kaal Bhairav Jayanti 2026: హిందూ మతంలో శివుని అనేక రూపాలను పూజిస్తారు. వాటిలో కాల భైరవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనను శివుని ఉగ్రరూపంగా, ధర్మాన్ని కాపాడే దైవంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, కాల భైరవుడు తన భక్తులను రక్షించి, భయం, ప్రతికూల శక్తులు, జీవితంలోని అడ్డంకుల నుంచి విముక్తి కల్పిస్తాడు. అందుకే ఆయనను ఆరాధించేందుకు కాల భైరవ అష్టమి/జయంతిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక/మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు కాల భైరవునిగా అవతరించాడని పురాణ విశ్వాసం. 2026లో కాల భైరవ జయంతి డిసెంబర్ 1, మంగళవారం నాడు జరుపుకోనున్నారు. కాశీ క్షేత్రానికి రక్షకుడిగా భావించే కాల భైరవుడిని ‘కాశీ కొత్వాల్’ అని కూడా పిలుస్తారు.

ఈ పవిత్రమైన రోజున భైరవుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించడం సంప్రదాయం. వీటిని ఆచరించడం వల్ల దైవానుగ్రహం, మనశ్శాంతి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కాల భైరవ జయంతి నాడు పాటించాల్సిన ఐదు ముఖ్యమైన ఆచారాలు ఇవే.

కాల భైరవ జయంతి నాడు పాటించాల్సిన 5 ఆచారాలు

  1. ఆవనూనె దీపం వెలిగించండి: కాల భైరవ అష్టమి/జయంతి రోజున సాయంత్రం లేదా రాత్రి కాల భైరవ స్వామి ముందు ఆవనూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలతలు తొలగి, భయం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
  2. నల్ల కుక్కకు ఆహారం పెట్టండి: కాల భైరవుని వాహనంగా కుక్కను, ముఖ్యంగా నల్ల కుక్కను భావిస్తారు. ఈ రోజున నల్ల కుక్కకు రొట్టె లేదా ఇతర ఆహారం పెట్టడం శుభప్రదంగా నమ్ముతారు. జంతువులకు ఆహారం అందించడం ద్వారా దయ, సేవాభావాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. నల్ల నువ్వులు, మినప పప్పు దానం చేయండి: ఈ రోజున నల్ల నువ్వులు, మినప పప్పు, ఆవనూనె, నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు.
  5. కాల భైరవ మంత్రాన్ని జపించండి: కాల భైరవ జయంతి నాడు ‘ఓం కాలభైరవాయ నమః’ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. వీలైతే 108 సార్లు జపించడం సంప్రదాయం. ఈ మంత్ర జపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు.
  6. కాల భైరవ అష్టకం లేదా చాలీసా పఠించండి: ఈ పవిత్రమైన రోజున కాల భైరవ అష్టకం లేదా భైరవ చాలీసా పఠించండి. అలాగే స్వామికి ఇమర్తి, జిలేబీ, కొబ్బరికాయ, చుర్మా లేదా తీపి రొట్టెను నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంచండి. కాల భైరవ జయంతి రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, దానధర్మాలు చేయడం ద్వారా స్వామి అనుగ్రహం పొందవచ్చని భక్తుల విశ్వాసం.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పూజా విధానాలు, ఆచారాలు, వాటి ఫలితాలు హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. ఆచారాలను పాటించడం వ్యక్తిగత విశ్వాసం, సంప్రదాయాలకు సంబంధించిన విషయం.)

Follow Us