AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా “బ్యాంక్ క్లోజ్”…. అసలేం జరిగింది!

అమెరికా బ్యాంకింగ్ రంగానికి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇండియానా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ 'యునైటెడ్ ఫిడెలిటీ బ్యాంక్' (United Fidelity Bank) క్లోజ్ అయ్యింది. ఫెడరల్ నియంత్రణ సంస్థలు ఈ బ్యాంకును మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా బ్యాంక్ క్లోజ్.... అసలేం జరిగింది!
United Fidelity Bank
Korivi Jayakumar
|

Updated on: Nov 29, 2026 | 10:27 PM

Share

అమెరికా బ్యాంకింగ్ రంగానికి మరోసారి భారీ షాక్ తగిలింది. ఇండియానా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ‘యునైటెడ్ ఫిడెలిటీ బ్యాంక్’ (United Fidelity Bank) క్లోజ్ అయ్యింది. ఫెడరల్ నియంత్రణ సంస్థలు ఈ బ్యాంకును మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కాగా 2024లో ‘రిపబ్లిక్ ఫస్ట్ బ్యాంక్’ కుప్పకూలిన రెండేళ్ల తర్వాత అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం ఇదే కావడంతో ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అసలు కారణం ఏంటి ??

బ్యాంకు ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడితప్పడం, కస్టమర్లు తమ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తే చెల్లించలేని దుస్థితి నెలకొనడంతో అమెరికా కరెన్సీ నియంత్రణ సంస్థ (OCC) రంగంలోకి దిగింది. బ్యాంకు కార్యకలాపాలు ఏమాత్రం సురక్షితంగా లేవని.. భవిష్యత్తులో ఆర్థిక బాధ్యతలను నెరవేర్చలేదని నిర్ధారించుకున్న తర్వాతే దీనిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 నాటి లెక్కల ప్రకారం ఈ బ్యాంకుకు దాదాపు 5.9 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.54 వేల కోట్లు) ఆస్తులు, 5.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇంత భారీ ఆస్తులున్న బ్యాంకు ఒక్కసారిగా కుప్పకూలడంతో FDIC బీమా నిధికి సుమారు 1.83 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొత్త యాజమాన్యం చేతికి బ్రాంచ్‌లు..

బ్యాంకు మూతపడిన వెంటనే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC)ను రిసీవర్‌గా నియమించింది. FDIC వేలం ప్రక్రియ నిర్వహించి, నార్త్ కరోలినాకు చెందిన ‘ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీ’కి దీనిని అప్పగించింది. ఈ ఒప్పందంలో భాగంగా 4.5 బిలియన్ డాలర్ల డిపాజిట్లు.. 3.1 బిలియన్ డాలర్ల రుణాలు, 5.9 బిలియన్ డాలర్ల ఆస్తులను ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఇండియానా, ఇల్లినాయిస్, ఫ్లోరిడా, కొలరాడో రాష్ట్రాలతో పాటు వర్జిన్ దీవుల్లో ఉన్న 22 యునైటెడ్ ఫిడెలిటీ బ్రాంచ్‌లు ఇకపై ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్ పేరుతో కార్యకలాపాలు సాగించనున్నాయి.

ఖాతాదారుల డబ్బుకు భరోసా ఉందా?

బ్యాంక్ క్లోజ్ అయిందన్న వార్తతో ఖాతాదారులు కంగారు పడాల్సిన పనిలేదని అధికారులు స్పష్టం చేశారు. కస్టమర్ల డిపాజిట్లన్నీ ఆటోమేటిక్‌గా ఫస్ట్ సిటిజన్స్ బ్యాంక్‌కు బదిలీ అవుతాయి. పాత చెక్కులు, ఏటీఎం, డెబిట్ కార్డులను ఎప్పటిలాగే వాడుకోవచ్చు. లోన్లు తీసుకున్న వారు కూడా యథావిధిగా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా నిబంధనల ప్రకారం ఒక్కో ఖాతాదారుడికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ.2.25 కోట్లు) వరకు డిపాజిట్ బీమా రక్షణ కొనసాగుతుందని FDIC భరోసా ఇచ్చింది.

ఈ ఏడాదిలో ఏడో వికెట్..

అమెరికా బ్యాంకింగ్ రంగంలో వరుస వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు మొత్తం ఏడు బ్యాంకులు మూతపడ్డాయి. జనవరి, మే నెలల్లో ఒక్కొక్కటి, జూలైలో రెండు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఒక్కొక్కటి చొప్పున దివాలా తీయగా.. తాజాగా యునైటెడ్ ఫిడెలిటీ ఏడో బ్యాంకుగా ఆ జాబితాలో చేరింది. 2024 ఏప్రిల్‌లో 6 బిలియన్ డాలర్ల ఆస్తులున్న రిపబ్లిక్ ఫస్ట్ బ్యాంక్ తర్వాత ఇదే అతిపెద్ద పతనంగా నిలిచింది.

Follow Us
బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా "బ్యాంక్ క్లోజ్"...!
బిగ్ షాక్ : రూ. 54 వేల కోట్ల ఆస్తులున్నా
కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి
కార్తీక సోమవారం వ్రత మహిమ.. కుక్కగా పుట్టిన మహిళకు కైలాస ప్రాప్తి
"ఆకాశంలో ఒక తార" టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు-చరణ్ వీడియో వైరల్ !
Video: టీచర్‌తో డ్యాన్స్ వైరల్.. 'జెన్ జీ టీచర్' అంటూ ప్రశంసలు!
Video: టీచర్‌తో డ్యాన్స్ వైరల్.. 'జెన్ జీ టీచర్' అంటూ ప్రశంసలు!
గొంతులో పాము ఉన్నట్లు కల వస్తోందా? అసలు అర్థం ఇదే!
గొంతులో పాము ఉన్నట్లు కల వస్తోందా? అసలు అర్థం ఇదే!
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్..
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్..
లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం..
లోక్‌సభలో నెంబర్ గేమ్.. ఎన్డీఏ పక్కా వ్యూహం..
హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 సంస్థల అద్భుత ప్రదర్శనలు!
హైదరాబాద్‌లో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 సంస్థల అద్భుత ప్రదర్శనలు!
తిరుమల శ్రీవారి గర్భగుడిలో 5 విగ్రహాలు ఉన్నాయని తెలుసా? పంచబేరాల
తిరుమల శ్రీవారి గర్భగుడిలో 5 విగ్రహాలు ఉన్నాయని తెలుసా? పంచబేరాల
పసుపు రంగులోకి మారిన దిండ్లకు ఇలా చేస్తే కొత్త లుక్!
పసుపు రంగులోకి మారిన దిండ్లకు ఇలా చేస్తే కొత్త లుక్!