AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Raaka: రిలీజ్‌కు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ‘రాకా’.. అల్లు అర్జున్ ఏమన్నారంటే?

'పుష్ప 2' తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో 'రాకా'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ మూవీపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్.

Allu Arjun Raaka: రిలీజ్‌కు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి 'రాకా'.. అల్లు అర్జున్ ఏమన్నారంటే?
Allu Arjun Raaka Movie
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 6:44 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’. హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు రిలీజుకు ముందే ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. ‘రాకా’ టీమ్ 37 మంది నటీనటులను ఏకకాలంలో చిత్రీకరించి, రియల్-టైమ్‌లో అత్యధిక మంది కదలికలను క్యాప్చర్ చేసిన సినిమాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక రిమార్కబుల్ ఫీట్ సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇది వరల్డ్ సినిమాకి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాకాతో కేవలం ఇండియన్ స్టాండర్డ్స్ మాత్రమే కాదు, గ్లోబల్ స్టాండర్డ్స్ లిమిట్స్ సెట్ చేస్తున్నాం. మాకు ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చినందుకు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. డైరెక్టర్ అట్లీ విజన్ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అట్లీ వల్లే ఈరోజు ఇంతటి టెక్నికల్ అచీవ్మెంట్ సాధించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్నాము. ఇండియన్ సినిమా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు అట్లీకి థ్యాంక్స్. మీరు ఈ గొప్ప విజయంతో పాటు ఇప్పటికే ఎన్నో, మరెన్నో విజయాలను సాధించాలి. ‘రాకా’ సినిమాటోగ్రాఫర్ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, ప్రొడక్షన్ డిజైనర్, ఫైట్ మాస్టర్ కు ధన్యవాదాలు. మీ అందరి సహకారం లేకుండా ఈ ఘనత సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా కోసం మేము కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నామని నాకు తెలుసు. మీకు బెస్ట్ సినిమా అందించడానికి మేం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కాస్త ఓపిక పట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు అన్ని విధాలుగా సపోర్ట్ అందించినందుకు సన్ పిక్చర్స్ కు థ్యాంక్స్ చెప్తున్నా. ‘రాకా’ మూవీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆశిస్తున్నాను’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ స్పీచ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us