Ram Charan: మరోసారి ఆస్పత్రికి వెళ్లిన హీరో రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
'పెద్ది' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు చరణ్. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తన మణికట్టు గాయానికి సర్జరీ చేయించుకున్న చెర్రీ ఇప్పుడు మరోసారి కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి చేరుకున్నారు. సర్జరీ సమయంలో వేసిన రాడ్లను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు మరో 8 నుంచి 10 వారాల పాటు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయించుకోనున్నారు రామ్ చరణ్. అంటే దాదాపు రెండు నెలలకు పైగా చరణ్ రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది జులై ప్రారంభంలో రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యకు ఇదే కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
కాగా ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయం అయింది. అయితే షూటింగ్, సినిమా ప్రమోషన్స్ అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్న ఉద్ధేశ్యంతో ఆయన సర్జరీ చేయించుకోలేదు. పెద్ది సినిమా రిలీజైన తర్వాత జులై నెలలో సర్జరీ చేయించుకున్నారు చరణ్. ఆ సమయంలో డాక్టర్లు ఆయన మణికట్టుకు రాడ్లు వేశారు. ఇప్పుడు వాటిని విజయవంతంగా తొలగించారు. ఇక పెద్ది తర్వాత తన తదుపరి సినిమాను సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్నారు రామ్ చరణ్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబోలో మరో సినిమా వస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గాయం నుంచి కోలుకున్నాకే రామ్ చరణ్ సినిమా సెట్స్ లోఅడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
వీడియో ఇదిగో..
#RamCharan underwent a planned follow-up procedure at Ganga Hospital, Coimbatore, following his wrist injury.
His cast and wrist rods have been successfully removed.
He will now undergo 8–10 weeks of intensive physiotherapy and is expected to resume shooting after mid-November.… pic.twitter.com/QgwkPFf00J
— Trends RamCharan ™ (@TweetRamCharan) September 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




