AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laila: సూర్య-జ్యోతికల ప్రేమ అలా మొదలైందా? స్టార్ కపుల్ సీక్రెట్స్ బయటపెట్టిన లైలా

ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లైలా. అయితే పెళ్లయ్యి హీరోయిన్ అవకాశాలు తగ్గాక సహాయక నటిగా మారిపోయిందీ అందాల తార. ఇటీవల విలన్ గానూ ఆకట్టుకుంటోందీ ముద్దుగుమ్మ. అయితే ఓ ఇంటర్వ్యూలో సూర్య- జ్యోతికల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది లైలా.

Actress Laila: సూర్య-జ్యోతికల ప్రేమ అలా మొదలైందా? స్టార్ కపుల్ సీక్రెట్స్ బయటపెట్టిన లైలా
Laila, Suriya, Jyothika
Basha Shek
|

Updated on: Nov 27, 2026 | 8:43 PM

Share

1990- 2000వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లైలా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 1996లో వచ్చిన హిందీ సినిమా ‘దుష్మన్ దునియా కా’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన లైలా, ఆ తర్వాత మలయాళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యంగా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది లైలా. కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గానూ యాక్ట్ చేసింది. ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, లవ్ స్టోరీ 1999, నా హృదయంలో నిదురించే చెలి, నువ్వే కావాలి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి తదితర సినిమాల్లో నటించింది లైలా. ఇక పెళ్లయ్యాక చాలా రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయిందీ అందాల తార. 2006-2022 మధ్య ఏ సినిమాలోనూ లైలా నటించలేదు. అయితే 2022లో సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గోట్, శబ్ధం, గోదారి గట్టుపైన తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటించింది.

కాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కలిసి లైలా పలు సినిమాల్లో నటించింది. వీళ్ళిద్దరి జంటను ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. ముఖ్యంగా శివ పుత్రుడు సినిమాలో సూర్య- లైలా ల జోడీ ఆడియెన్స్ ను కట్టి పడేసింది. ఇక సూర్య సరసన నటించిన హీరోయిన్లలో లైలా బెస్ట్ పెయిర్ అని ఒకప్పుడు జ్యోతిక స్వయంగా చెప్పింది. ఈ నేపథ్యంలో సూర్య, జ్యోతికల ప్రేమ గురించి తనకు ఎలా తెలిసిందో లైలా చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లైలా.. ‘నేను జ్యోతిక, సూర్యలకు క్లోజ్ ఫ్రెండ్‌ని. కాబట్టి వాళ్లిద్దరి ప్రేమ గురించి నాకు ముందుగానే తెలుసు. మేం ‘3 రోజెస్’ సినిమాలో కలిసి పనిచేస్తున్నప్పుడే వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం నాకు తెలిసింది. అప్పట్లో జ్యోతికనే స్వయంగా తన ప్రేమ గురించి నాతో చెప్పింది. అంతేకాదు, షూటింగ్ సమయంలో సూర్య కారులో వచ్చి జ్యోతికను పికప్ చేసుకునేవాడు’ అని లైలా చెప్పుకొచ్చింది. లైలా చెప్పిన సూర్య, జ్యోతికల లవ్ సీక్రెట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us