AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khaidi Movie: ఎంత పనిచేశావ్‌ అన్నా..కార్తీ ‘ఖైదీ’ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా 'ఖైదీ'. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో కార్తీ పోషించిన ఢిల్లీ బాబు పాత్ర బాగా హైలెట్  గా నిలిచింది.

Khaidi Movie: ఎంత పనిచేశావ్‌ అన్నా..కార్తీ 'ఖైదీ'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
Khaidi Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2026 | 7:23 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉండవచ్చు.. కానీ 2019లో వచ్చిన ఖైదీ మాత్రం కార్తీ కెరీర్ లో చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కార్తీకి స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. 2019 లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఖైదీ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. కార్తీతో పాటు నరైన్, హరీశ్ పేరడి, హరీశ్ ఉత్తమన్, రమణ, జార్జ్ మేరియన్, దీన.. ఇలా చాలా మంఇ నటీనటులు ఈ సినిమాలో నటించారు. అయితే కార్తీ పోషించిన ఢిల్లీ బాబు పాత్రే ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కార్తి కెరీర్ టర్న్ చేయడంతో పాటు లోకేశ్ కనగరాజ్‌కి తెలుగులో చాలా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనేది మూలం కూడా ఈ చిత్రమే. ఈ సినిమా చూసిన తర్వాత ఈ పాత్రలో కార్తి తప్పితే మరెవరూ సెట్ అవ్వరేమో అనిపించింది. అంతలా ఈ పాత్రలో ఒదిగిపోయాడు కార్తీ. అయితే ఇప్పుడీ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఖైదీ సినిమాకు కార్తీ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమా కోసం ముందుగా ఒక స్టార్ హీరోను అనుకున్నారట. అయితే వివిధ కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో కార్తీకి ఛాన్స్ వచ్చిందట. అలా ఖైదీ సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో మరెవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ నే అందరితో పంచుకున్నాడు.

‘ఖైదీ సినిమా ముందు నా దగ్గరకే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఫైనల్ అవ్వలేదు. కార్తి ఆ సినిమా చేయాలనుకున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి.. ‘యోవ్ వీఎస్, నేను చేస్తానయ్యా’ అన్నారు. అందుకు నేను ‘చాలా బాగా చేయండి సర్’ అని చెప్పాను. దాని గురించి నాకు ఎలాంటి బాధ లేదు. లోకేశ్ కనకరాజ్ నాకు బాగా తెలుసు. నాకు బ్రదర్ లాంటివాడు. కార్తి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని అర్థమైంది. తమిళం, తెలుగులో ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని కూడా వాళ్లతో చెప్పాను. ఇది అద్భుతమైన సినిమా, మంచి సినిమా. కానీ ఓ మంచి మూవీ కోల్పోయానని నేను బాధ పడడం లేదు’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఒకవేళ విజయ్ సేతుపతి ఖైదీ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదోనని నెటిజన్లు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఖైదీ సినిమా గురించి విజయ్ సేతుపతి మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే