ఈ కొత్త డిస్‌ప్లే చూస్తే Motorola Signature 27 ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూడాల్సిందే..స్పెషాలిటీ ఏంటంటే?
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మోటరోలా సిద్ధమైంది. Motorola Signature 27 పేరుతో కొత్త అల్ట్రా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ను డిసెంబర్ 9న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్, అత్యాధునిక కెమెరా వ్యవస్థ, భారీ బ్యాటరీతో పాటు ప్రత్యేకమైన డిస్‌ప్లే టెక్నాలజీని అందించడం విశేషం.

స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల్లో ప్రస్తుతం కెమెరా నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని Motorola Signature 27ను రూపొందించినట్లు ఫోన్ ఫీచర్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 200MP పెరిస్కోప్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్, ఏడు సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి.
12,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో AMOLED డిస్‌ప్లే..
Motorola Signature 27లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌ను అందించారు. Wi-Fi 8, మెరుగైన 5G కనెక్టివిటీ కోసం 6-యాంటెన్నా వ్యవస్థ ఉన్నాయి. గేమింగ్, ఏఐ టాస్క్‌ల సమయంలో వేడిని నియంత్రించేందుకు ArcticMesh కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో మైక్రో-డైమండ్ థర్మల్ జెల్, గత తరంతో పోలిస్తే 40 శాతం పెద్ద వేపర్ ఛాంబర్ ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 1.5K Super HD రిజల్యూషన్‌తో Extreme AMOLED Duo డిస్‌ప్లేను ఇచ్చారు. Dolby Vision సపోర్ట్‌తో పాటు Tandem Emissive Layer టెక్నాలజీ ఇందులో ఉంది. గరిష్ఠంగా 12,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. సాధారణ AMOLED స్క్రీన్‌లతో పోలిస్తే 34 శాతం మెరుగైన ఎనర్జీ ఎఫిషియన్సీ, 121 శాతం ఎక్కువ ప్యానెల్ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
కెమెరాల విషయానికి వస్తే DXOMARK గోల్డ్ లేబుల్ పొందిన మల్టీ-సెన్సార్ వ్యవస్థను అందించారు. LOFIC టెక్నాలజీతో కూడిన 50MP Sony LYTIA L910 ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్, 100X హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేసే 200MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 50MP అల్ట్రావైడ్, 50MP ఫ్రంట్ కెమెరాలను ఇచ్చారు. Event-Based Vision Sensor వేగంగా కదిలే వస్తువులను గుర్తించి ఫొటోలు తీయడంలో సహాయపడుతుంది. సెల్ఫీ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. Dolby Vision వీడియో రికార్డింగ్, ఏఐ వీడియో ఎన్‌హాన్స్‌మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
7,000mAh బ్యాటరీ..
బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, సిరామిక్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను ఉపయోగించారు. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass Ceramic 3ను అందించారు. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. Pantone Coal Smoke, Pantone Capucault Olive రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.
ఇందులో 7,000mAh బ్యాటరీని అందించారు. 90W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ అందిస్తామని మోటరోలా ప్రకటించింది. మెమరీ సంబంధిత భద్రతా లోపాలను నివారించేందుకు ARM Memory Tagging Extension (MTE) టెక్నాలజీని కూడా ఇచ్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 9న లాంచ్ అనంతరం Motorola అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ రోజున ధరపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
