నవంబర్ 27 రాశి ఫలాలు..ఉద్యోగం, వ్యాపారాల్లో వీరికి తిరుగులేని పురోగతి!
Horoscope Today (27 November, 2026): శుక్రవారం నాటి దిన ఫలాలు వచ్చేశాయి. ఈ రోజు కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో కీలక బాధ్యతలు, ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. మరికొందరికి వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగనున్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి శుక్రవార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (నవంబర్ 27, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో పై అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని మార్పులు, చేర్పులతో వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమ యం. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. చిన్నా చితకా సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఢోకాఉండదు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని మార్పులు, చేర్పులతో వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకోవడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆశించిన స్థాయిలో లాభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. ముఖ్యమైన పనులు, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సంతృప్తికరంగా నెరవేరు తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. ఆర్థిక విషయాలకు ప్రాధాన్యమిస్తారు. జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదంలో విజయం లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. పనితీరు, మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ, వ్యయాలు సమా నంగా ఉంటాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలకు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. బంధుమిత్రులతో ఒక శుభ కార్యంలో పాల్గొం టారు. అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించిన రాబడిఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో లక్ష్యాలు, బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశముంది. కొద్దిపాటి వ్యయ ప్రయా సలతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థి తులు నిలకడగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లభించదు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ప్రభుత్వమూలక ధనలాభం ఉంది. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. శుభకార్యంలో బంధువుల్ని కలుసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సంతృప్తికరంగా బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజ యాలు సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. రాబడికి లోటుండదు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టక తప్పదు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. జీవిత భాగ స్వామికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. హోదా పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిత్రుల నుంచి బాకీలు వసూలవుతాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపా రాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు.



