AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ కొత్త ఫీచర్.. మెసేజ్‌లను ముందే షెడ్యూల్.. ఎలా వాడాలో తెలుసా ?

ప్రముఖ మెసేజింగ్ యాప్ "వాట్సాప్" అందరికీ సుపరిచితమే. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక క్రేజీ ఫీచర్ ను ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే గ్లోబల్‌గా ఈ అప్‌డేట్‌ను విడుదల చేయగా.. రాబోయే కొద్ది వారాల్లో యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి ? దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం..

వాట్సాప్ కొత్త ఫీచర్.. మెసేజ్‌లను ముందే షెడ్యూల్.. ఎలా వాడాలో తెలుసా ?
Whatsapp Latest Update
Korivi Jayakumar
|

Updated on: Nov 26, 2026 | 5:54 PM

Share

ప్రముఖ మెసేజింగ్ యాప్ “వాట్సాప్” అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్ గా గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత చాటింగ్, గ్రూప్ సంభాషణలు, ఫోటోలు, లొకేషన్, డాక్యుమెంట్ షేరింగ్‌ వరకు అన్నింటినీ సులభతరం చేసింది. కాగా ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక క్రేజీ ఫీచర్ ను ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే గ్లోబల్‌గా ఈ అప్‌డేట్‌ను విడుదల చేయగా.. రాబోయే కొద్ది వారాల్లో దశలవారీగా యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి ? దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం..

మెసేజ్ షెడ్యూలింగ్..

సాధారణంగా మిత్రులకు అర్ధరాత్రి బర్త్‌డే విషెస్ చెప్పాలన్నా, పరీక్షకు వెళ్లే ముందు ఆల్ ది బెస్ట్ చెప్పాలన్నా, లేదా ఆఫీసు పనులకు సంబంధించిన రిమైండర్లు పంపాలన్నా ముందు గానే సెట్ చేసుకునే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకోసమే ఇకపై అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. అదే ‘మెసేజ్ షెడ్యూలింగ్’ (Message Scheduling). దీని సాయంతో మనం ఇప్పుడు టైప్ చేసిన మెసేజ్‌ను కనీసం 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్టంగా 14 రోజుల లోపు ఎప్పుడైనా సరే.. మనకు నచ్చిన తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా డెలివరీ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్‌లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందని ప్రకటించింది. దీంతో ఈ విషయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఎలా షెడ్యూల్ చేయాలంటే..

  • ముందుగా మీరు ఎవరికి మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి వ్యక్తిగత చాట్ లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయండి.
  • మీరు పంపాలనుకున్న టెక్స్ట్ మెసేజ్ టైప్ చేయండి. లేదా ఫోటో, వీడియోను అటాచ్ చేయండి.
  • ఇప్పుడు సాధారణంగా మెసేజ్ పంపినట్టు ‘సెండ్’ (Send) బటన్‌పై క్లిక్ చేయకుండా.. కాసేపు నొక్కి పట్టుకోండి (Press and hold).
  • వెంటనే స్క్రీన్‌పై తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కావాల్సిన టైమ్ సెట్ చేసి కన్ఫర్మ్ చేస్తే చాలు, మీ మెసేజ్ క్యూలో ఉండిపోతుంది.
  • ఒకవేళ ఆ మెసేజ్ వెళ్లకముందే మీకు ఆలోచన మారితే, పెండింగ్‌లో ఉన్న షెడ్యూల్డ్ మెసేజ్‌లను చూసి డిలీట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోటోలు మరియు వీడియోలను మాత్రమే షెడ్యూల్ చేయగలరు. కనీసం 10 నిమిషాల గ్యాప్‌తో మొదలుపెట్టి 14 రోజుల వరకు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే డాక్యుమెంట్లు లేదా ఇతర మీడియా ఫైల్స్ షెడ్యూల్ అవుతాయో లేదో వాట్సాప్ ఇంకా స్పష్టం చేయలేదు.

ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా మెసేజ్ వెళ్తుందా?

ఈ ఫీచర్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదే అని చెప్పాలి. మీరు మెసేజ్ షెడ్యూల్ చేసిన తర్వాత, సరిగ్గా ఆ డెలివరీ సమయానికి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఛార్జింగ్ అయిపోయినా లేదా ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉన్నా సరే.. మెసేజ్ మాత్రం కచ్చితంగా అవతలి వారికి వెళ్లిపోతుంది. పైగా ఇది షెడ్యూల్ చేసిన మెసేజ్ అని రిసీవర్‌కు ఎలాంటి ప్రత్యేక ట్యాగ్ కనిపించదని స్పష్టం చేస్తున్నారు. సాధారణ మెసేజ్ లాగే వీటికి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End-to-End Encryption) భద్రత ఉంటుంది కాబట్టి ప్రైవసీకి ఎలాంటి ఢోకా లేదని క్లారిటీ ఇస్తున్నారు.

Follow Us