AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్లిక్‌గా సీఎం విజయ్‌ను ముద్దాడిన చిన్నారి.. ఆయన రియాక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు సి. జోసెఫ్‌ విజయ్‌కు ఓ చిన్నారి అభిమాని ఇచ్చిన ముద్దు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ బాలుడు చూపించిన ఆప్యాయతకు విజయ్‌ స్పందించిన తీరు నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ చిన్నారితో ఎంతో ప్రేమగా మాట్లాడిన ఆయన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పబ్లిక్‌గా సీఎం విజయ్‌ను ముద్దాడిన చిన్నారి.. ఆయన రియాక్షన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!
Young Fan Kisses Cm Vijay
Balaraju Goud
|

Updated on: Nov 26, 2026 | 9:31 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు సి. జోసెఫ్‌ విజయ్‌కు ఓ చిన్నారి అభిమాని ఇచ్చిన ముద్దు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ బాలుడు చూపించిన ఆప్యాయతకు విజయ్‌ స్పందించిన తీరు నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ చిన్నారితో ఎంతో ప్రేమగా మాట్లాడిన ఆయన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

గురువారం (నవంబర్‌ 26) చెన్నైలోని నీలన్‌కరై ఆర్‌కే కన్వెన్షన్‌ సెంటర్‌లో టీవీకే విద్యా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓ చిన్న బాలుడు నేరుగా విజయ్‌ వద్దకు వెళ్లి ఆయన చెంపపై ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఊహించని ఈ పరిణామంతో క్షణం ఆశ్చర్యానికి గురైన విజయ్‌ వెంటనే చిరునవ్వు చిందించారు. అనంతరం ఆ బాలుడితో కొద్దిసేపు ముచ్చటించి, కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ చిన్న సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. అభిమానులు హార్ట్‌, హార్ట్‌ ఐస్‌ ఎమోజీలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఏటా ఈ విద్యా పురస్కారాలను నిర్వహిస్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తారు. 2026లో జరుగుతున్న ఈ కార్యక్రమం రెండో దశలో భాగంగా నవంబర్‌ 26, 27 తేదీల్లో తొమ్మిది జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక వేడుక కాదు. ముఖ్యమంత్రి విజయ్‌ నాయకత్వంలోని టీవీకే పార్టీ స్వయంగా నిర్వహిస్తున్న విద్యార్థుల సన్మాన కార్యక్రమం. రాజకీయాలు, అధికారిక హోదాలకు అతీతంగా చిన్నారులతో విజయ్‌ కలిసిపోయిన తీరు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారితో ఆత్మీయంగా మెలిగిన ఈ క్షణం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మొత్తానికి, ఓ చిన్నారి తన అభిమానాన్ని ముద్దు రూపంలో వ్యక్తం చేయడం.. దానికి విజయ్‌ చిరునవ్వుతో స్పందించడం ఈ కార్యక్రమంలోని మధురమైన ఘట్టంగా నిలిచింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చూసిన పలువురు, ముఖ్యమంత్రి స్పందనలోని ఆప్యాయతను ప్రశంసిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us