దళపతి విజయ్
దళపతి విజయ్ ఇన్నాళ్లు హీరోగా రాణించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి షేక్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన విజయ్ ఆతర్వాత హీరోగా మారాడు. 1992లో వచ్చిన నాలయ తీర్పు అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. టీవీకే పేరుతో పార్టీ పెట్టి పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇన్నాళ్లు తమిళ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించాడు విజయ్.. అలాగే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు తమిళనాట ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నాడు విజయ్. మొదటి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్లకు కేవలం 10 అడుగుల దూరంలో విజయ్ ఆగిపోవడంతో ఇప్పుడు పొత్తుల పర్వం మొదలైంది. తమిళ రాజకీయాల్లో గత ఐదు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక ఆధిపత్యానికి దళపతి విజయ్ తెరదించారు.
ఇంకా చదవండిVijay Thalapathy : 52 దాటినా అదే క్రేజ్, అదే ఫిట్‌నెస్.. విజయ్ రోజూ తినే ఆ ‘స్పెషల్ ఫుడ్’ ఏంటో తెలుసా?
దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం దక్షిణాదిలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విజయ్ వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తుంటారు. తాజాగా ఆయన డైట్ సీక్రెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
- Rajitha Chanti
- Updated on: Sep 30, 2026
- 3:22 pm
మరింత విస్తరించిన ఉచిత బ్రేక్‌ఫాస్ట్.. పిల్లల మధ్య సీఎం.. నేలపై కూర్చొని విజయ్ బ్రేక్‌ఫాస్ట్!
తమిళనాడులో పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం మరింత విస్తరించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం చెన్నై తిరువాన్మియూర్‌లోని గాంధీ గ్రామం ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం విస్తరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన ఆయన.. వారితో కలిసి పొంగల్ తిన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
- Balaraju Goud
- Updated on: Sep 22, 2026
- 12:39 pm
నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్
తమిళ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిషల వైరల్ వీడియోపై ప్రముఖ నటి అంబికా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన లే మాన్స్ కప్ రేస్‌లో వీరిద్దరూ కలిసి కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. త్రిష స్థానంలో తాను ఉంటే అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదంటూ అంబికా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారాయి.
- Samatha J
- Updated on: Sep 17, 2026
- 11:40 am
CM Vijay- Trisha: నేనే గనక త్రిష స్థానంలో ఉంటే.. హాట్ టాపిక్‌గా సీనియర్ నటి అంబిక కామెంట్స్
కోలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెగ వినిపిస్తోంది. ఇక విజయ్ ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్ అయిపోయింది.
- Basha Shek
- Updated on: Sep 16, 2026
- 2:46 pm
Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రణబాలి ఒకటి. క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
- Rajitha Chanti
- Updated on: Sep 8, 2026
- 8:56 am
విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!
దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాట జెన్ జెడ్ ఓటర్ల ప్రాధాన్యత పెరిగింది. ఆయన పార్టీ యువతకు పెద్దపీట వేయడంతో, ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సైతం యువతను ఆకర్షించే వ్యూహాలను అవలంబిస్తున్నాయి. డీఎంకే సంస్థాగత మార్పులు చేపట్టి, జిల్లా స్థాయి పదవుల్లో వయోపరిమితులు విధించి, యువతకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి.
- Ch Murali
- Updated on: Aug 22, 2026
- 6:13 pm
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సర్కార్ గుడ్‌న్యూస్.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం?
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రవాణా సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కారు, వ్యక్తిగత సహాయకుడిని అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
- Ch Murali
- Updated on: Aug 17, 2026
- 9:42 pm
Jana Nayagan OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి విజయ్ చివరి సినిమా.. ‘జన నాయగన్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. తెలుగులో 'జన నాయకుడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
- Basha Shek
- Updated on: Aug 17, 2026
- 6:53 pm
Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. ఈ వేడుకకు ఆమె ఒక ప్రత్యేకమైన చీరలో హాజరైంది. అయితే తాజాగా ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Basha Shek
- Updated on: Aug 16, 2026
- 5:52 pm
అట్రాక్షన్ అంతా ఆమెదే.. సీఎం విజయ్‌కు సెల్యూట్ చేసిన త్రిష.. ఇదిగో వీడియో
చెన్నై మెరీనా బీచ్ వేదికగా జరిగిన తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్ గ్యాలరీలో ఆమెకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం ఆసక్తికరంగా మారింది. బంగారు రంగు చీరలో వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో త్రిషకు వరుసగా లభిస్తున్న ప్రాధాన్యతపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Aug 15, 2026
- 10:49 am
Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు!
తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత జోసఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌తో త్రిషకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Aug 11, 2026
- 4:10 pm
Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న విశాల్ తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో సొంత పార్టీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ ప్రస్థానం గురించి పంచుకున్నారు.
- Rajitha Chanti
- Updated on: Aug 11, 2026
- 9:13 am