AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బులకు ఆశపడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.. భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రష్యా సాయుధ దళాల్లో భారతీయులు చేరుతుండటంపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత పౌరులను అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు జారీ చేసింది. ధృవీకరించని ఏజెంట్లు లేదా వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, రష్యా సైన్యంలో చేరడం ప్రాణాలకు ముప్పు తెచ్చే అత్యంత ప్రమాదకరమైన చర్య అని స్పష్టం చేసింది.

డబ్బులకు ఆశపడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.. భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక హెచ్చరికలు
Mea Issues Strong Advisory To Indians Against Joining Russian Military
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Sep 30, 2026 | 11:03 PM

Share

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రష్యా వెళ్లే భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రష్యా సైన్యంలో చేరితే భారీగా డబ్బు వస్తుందన్న ఆశతో కొందరు స్వచ్ఛందంగా అక్కడి సైన్యంలో చేరుతున్నారు.తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాలకే తీవ్ర ముప్పు తెస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. కొందరు భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, రష్యా పాస్‌పోర్ట్ తీసుకుని మరీ సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

విదేశీ పౌరులను రష్యా సాయుధ దళాల్లో చేర్చేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద గ్రూపులు కూడా ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు ఇచ్చే ఏజెంట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అధికారికంగా నమోదై ఉన్నారా లేదా అనేది భారతీయులు తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించింది..గత రెండేళ్లుగా రష్యా సైన్యంలో చేరడంలో ఉన్న నష్టాలను, ప్రమాదాలను ప్రభుత్వం పదే పదే గుర్తుచేస్తోందని MEA పేర్కొంది.

రష్యా సైన్యంలో ఇప్పటికే చిక్కుకున్న భారతీయుల భద్రత, సంక్షేమం, వారిని త్వరితగతిన సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు రష్యా ప్రభుత్వంతో భారత ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ వెల్లడించింది ..భారత పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీసే మార్గాలను ఎంచుకోవద్దని, విదేశీ ఉద్యోగాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us