AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay- Trisha: నేనే గనక త్రిష స్థానంలో ఉంటే.. హాట్ టాపిక్‌గా సీనియర్ నటి అంబిక కామెంట్స్

కోలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోగా ఉన్న విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్‌ హీరోయిన్‌ త్రిష పేరు తెగ వినిపిస్తోంది. ఇక విజయ్ ఎన్నికల్లో గెలిచి, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనీ, రాజకీయాల్లోనూ త్రిష పేరు మరింత ట్రెండ్‌ అయిపోయింది.

CM Vijay- Trisha: నేనే గనక త్రిష స్థానంలో ఉంటే.. హాట్ టాపిక్‌గా సీనియర్ నటి అంబిక కామెంట్స్
CM Vijay And Trisha
Basha Shek
|

Updated on: Sep 16, 2026 | 2:46 PM

Share

తమిళనాడు సీఎం విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషలు మరోసారి వార్తల్లో నిలిచారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన అజిత్ కుమార్ ‘లే మాన్స్ కప్’ రేసులో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం విజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా విజయ్- త్రిషలకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేసింగ్‌ ఈవెంట్‌ను విజయ్‌ గ్యాలరీ నుంచి వీక్షిస్తుండగా సడెన్‌గా త్రిష మధ్యలోకి వచ్చింది. అయితే విజయ్‌ వెంటనే తన ముఖం వీడియోలో పడకుండా పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. వీరిద్దరు కలిసిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది. దీంతో త్రిష, విజయ్‌ల స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ నటి అంబిక స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త్రిష స్థానంలో ఉంటే తాను అలా కెమెరాల ముందు కనిపించేదాన్ని కాదని పేర్కొన్నారు.

‘ఒక వ్యక్తి గొప్ప స్థానంలోకి వెళ్లినంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మనం ఆలోచించినంత ఉన్నతంగా బయటి వ్యక్తులు ఉండరు. మన ప్రవర్తన వల్ల మన స్నేహితులపై విమర్శలు వస్తాయని తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నేను త్రిష స్థానంలో ఉంటే.. నా వల్ల అనవసరమైన నెగెటివిటీ వస్తుందని తెలిస్తే.. అలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్లేదాన్ని కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు.. అందులోనూ ఒకరు ఉన్నత పదవిలో ఉంటే ఆ స్నేహాన్ని వేరే విధంగా చూడకూడదు.’ అని అంబిక చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా అంబిక విషయానికొస్తే.. తెలుగు , కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి స్టార్ హీరోలతో కలిసి ఆమె పనిచ ఏసింది. అన్ని భాషల్లో కలిపి సుమారు 300 కు పైగా సినిమాల్లో నటించింది అంబిక. కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా నటించి మెప్పించారామె. ఇక 1988లో, అంబిక అమెరికాకు చెందిన ఒక డాక్టర్‌ మీనన్ ను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్లిపోయారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల కలిసున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 1996లో ఆమె విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు.

యూకేలో సీఎం విజయ్ తో త్రిష..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us