AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: ‘ఇరుముడి’ తర్వాత మళ్లీ స్కూలుకెళ్లిన బేబీ నక్షత్ర.. ఇంతకీ ఈ పాప ఎన్నో క్లాస్ చదువుతుందో తెలుసా?

  మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర కూడా ఓ కీలక పాత్ర పోషించింది. రవితేజ కూతురు మణెమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Irumudi: 'ఇరుముడి' తర్వాత మళ్లీ స్కూలుకెళ్లిన బేబీ నక్షత్ర.. ఇంతకీ ఈ పాప ఎన్నో క్లాస్ చదువుతుందో తెలుసా?
Irumudi Nakshatra
Basha Shek
|

Updated on: Sep 15, 2026 | 9:20 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ‘ఇరుముడి’ సినిమా. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఇరుముడి నిలిచింది. థియేటర్లలో ఈ సినిమా రిలీజై నెల రోజులు సమీపిస్తున్నా, ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించినా థియేటర్లలో ఇరుముడి హవా అసలు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రూ. 250 కోట్లకు చేరువగ ఉన్నాయి. ఇక ఈ శుక్రవారమే (సెప్టెంబర్ 18)నే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో రవితే జసరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే రవితేజ కూతురు మణెమ్మ పాత్రలో బేబీ నక్షత్ర అద్భుతంగా నటించింది. చిన్న వయసులోనే ఈ పాప తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్-రీకూతురు సెంటిమెంట్‌ సన్నివేశాల్లో నక్షత్ర నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇరుముడి బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ఇప్పుడీ మణెమ్మ (నక్షత్ర) పేరు నెట్టింట మార్మోగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఆమె విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా స్కూల్‌లో నక్షత్రతో కేక్‌ కట్‌ చేయించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. అందరూ చిన్నారి నక్షత్ర యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా బేబీ నక్షత్ర ప్రస్తుతం కన్నూర్‌లోని కడంబూర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది.

ఇవి కూడా చదవండి

ఇరముడి సినిమా విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.  కాగా ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోన్న ఇరుముడి సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచే  ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇదివరకే  అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇరుముడి సినిమా అందుబాటులోకి రానుంది.

స్కూల్ లో బేబీ నక్షత్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us