AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba: జంటగా వినాయక చవితి పూజ చేసిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్.. డేటింగ్‌పై హింట్ ఇచ్చినట్టేనా?

గత కొంతకాలంగా టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ వార్తలకు మరింత బలం చేకూరేలా వినాయక చవితిని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్.

Eesha Rebba: జంటగా వినాయక చవితి పూజ చేసిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్.. డేటింగ్‌పై హింట్ ఇచ్చినట్టేనా?
Eesha Rebba And Tharun Bhascker
Basha Shek
|

Updated on: Sep 14, 2026 | 4:30 PM

Share

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారన్న వార్తలకు మరోసారి బలం చేకూరింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని వీరు జంటగా పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా తరుణ్ భాస్కరే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అయితే ఈ పోస్టుకు తరుణ్ ఎలాంటి క్యాప్షన్ రాయలేదు. ఈషా కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ, తమ రిలేషన్ షిప్​ గురించి ఇలా హింట్ ఇస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి తోడు మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక, షాలిని కొండెపూడి లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా వీరికి ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అని విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారని నెటిజన్లు కూడా ఈషా- తరుణ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.

కాగా గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసే కనిపిస్తున్నారు. పలు సినిమా కార్యక్రమాలకు, ఈవెంట్లకు వీరిద్దరూ జంటగా హాజరవుతూనే ఉన్నారు. అంతేకాకుండా, తరుణ్ తల్లితో కలిసి ఈషా విమానాశ్రయాల్లో, షాపింగ్‌లో కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలై, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని టాక్. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి వార్తలపై తరుణ్ గానీ, ఈషా గానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ఓ సందర్భంలో ఇషాతో డేటింగ్ రూమర్లపై తరుణ్ భాస్కర్ మాట్లాడాడు. ఈషా తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని పేర్కొన్నారు. సరైన సమయంలో అన్ని విషయాలు వెల్లడిస్తానని కూడా తరుణ్ తెలిపారు. ఇప్పుడు కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా ఈషా, తరుణ్ తమ రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

 ఈషా రెబ్బాతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!