AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daali Dhananjaya: ‘పుష్ప’ విలన్ జాలిరెడ్డి కుమారుడి నామకరణ మహోత్సవం.. పేరు వెరైటీగా ఉందిగా.. ఫొటోస్ వైరల్

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పలో కన్నడ హీరో డాలీ ధనంజయ ఓ కీలక పాత్ర పోషించాడు. జాలి రెడ్డి అనే నెగెటివ్ రోల్ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో పాటు సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ సెకెండ్ హీరోగా మెప్పించాడు డాలీ.

Daali Dhananjaya: ‘పుష్ప’ విలన్ జాలిరెడ్డి కుమారుడి నామకరణ మహోత్సవం.. పేరు వెరైటీగా ఉందిగా.. ఫొటోస్ వైరల్
Daali Dhananjaya
Basha Shek
|

Updated on: Sep 14, 2026 | 9:47 PM

Share

కన్నడ నటుడు డాలీ ధనంజయ్ తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా సుపరిచితమే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డి పాత్రతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న డాలీ అప్పుడప్పుడు తెలుగుసినిమాల్లోనూ మెరుస్తున్నాడు. పుష్ప, పుష్ప 2తో పాటు సత్యదేవ్ తో కలిసి జీబ్రా అనే ఓ తెలుగు సినిమాలోనూ కీ రోల్ పోషించాడు డాలీ. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గతేడాది ఫిబ్రవరిలో ధన్యత అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు డాలీ ధనంజయ. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఈ ఏడాది మేలో తమ జీవితంలోకి ఒక పండంటి మగ బిడ్డను ఆహ్వానించారు లవ్లీ కపుల్. ఇక తాజాగా వినాయక చవితి పండగను పురస్కరించుకుని తమ బిడ్డకు నామకరణ మహోత్సవం నిర్వహించారు డాలీ దంపతులు. ఈ సందర్భంగా తమ కుమారుడికి ‘ఎరేయ’ అని పేరు పెట్టారీ దంపతులు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.

తమ కుమారుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన డాలీ ధనంజయ దంపతులు.. ‘అందరికీ గౌరీ గణేశ పండగ శుభాకాంక్షలు. మమ్మల్ని ప్రేమించే వాళ్లంతా, ‘మీ అబ్బాయిని ఎప్పుడు చూపిస్తారు, ఏం పేరు పెట్టారు’ అని అడుగుతున్నారు. ఈ పండగ రోజున, ఈరోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. ‘ఎరెయ’— ఇది ప్రాచీన కన్నడ సంప్రదాయంలో ఒక గౌరవప్రదమైన పదం. దీనికి ‘యజమాని, స్వామి, అధిపతి’ అని అర్థాలు వస్తాయి. ఒకప్పుడు రాజులను, చక్రవర్తులను గౌరవంగా పిలిచేందుకు ఈ పదాన్ని వాడేవారు. చారిత్రక పుటల్లో, చాళుక్య మహారాజు ఇమ్మడి పులకేశి చిన్ననాటి పేరు కూడా ‘ఎరెయ’ అని కనిపిస్తుంది. ఆ రాజసం, వారసత్వం, శక్తివంతమైన అర్థం ఉన్న మా జీవితంలోని చిన్న అధిపతి. మా హృదయానికి రాజు. మా ‘ఎరెయ’. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో జాలిరెడ్డి అలియాస్ డాలీ ధనంజయ

ప్రస్తుతం డాలీ ధనంజయ ఫ్యామిలీ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు , అభిమానులు, నెటిజన్లు డాలీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే వారి కుమారుడిని మనసారా ఆశీర్వదిస్తూ ఫొటోలు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us