పుష్ప 2

పుష్ప 2

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‏టైనర్ 2022 డిసెంబర్ 17న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ అయిన ఈసినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పుష్ప ది రైజ్ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డును గెలుచుకున్నారు. ఇక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఈ సినిమా మొత్తం 8 నామినేషన్స్ అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇంకా చదవండి

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముక్త కంఠంతో బన్నీ అరెస్ట్ ను ఖండిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై స్పందించారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో కనిపించిన ఎమోషన్స్

సొంతవాళ్లు కన్నీళ్లు పెట్టారు... అయినవాళ్లు హుటాహుటిన కదిలారు... స్నేహితులు అడుగడుగు ఫాలో అయ్యారు. తమ అభిమాన నటుడి అరెస్ట్‌ అవ్వడం చూసి... ఇటు ఫ్యాన్స్‌ కూడా ఆందోళన చెందారు. అల్లు అర్జున్‌ అరెస్టుతో... బెయిలా - జైలా అంటూ 6 గంటలపాటు సాగిన హైడ్రామా ఓ ఎత్తైతే... ఆ 6 గంటల్లో కనిపించిన ఎమోషనల్‌ సీన్స్‌ వెరీ హార్ట్‌ టచింగ్‌ అనే చెప్పాలి. ఎంతో భావోద్వేగం... మరెంత భయాందోళన అటు ఫ్యామిలీ ఇటు ఫ్యాన్స్‌లో కనిపించింది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..  అలా అనేసిందేంటి?

సంధ్య థియేటర్‌వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేయడం ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీనిని ఖండిస్తున్నారు. 'వియ్ ఆల్ స్టాండ్ విత్ అల్లు అర్జున్'అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Allu Arjun Arrest: ‘దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?’ డైరెక్టర్ ఆర్జీవీ సంచలన ట్వీట్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ చేయడం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. పలువురు సినీ ప్రముఖులు బన్నీకి మద్దతుగా నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన ట్వీట్ చేశారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌- బెయిల్.. అసలు ఉదయం నుంచి ఏం జరిగిందంటే..

అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్‌పై 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు, నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5-10 ఏళ్లు జైలు శిక్షపడే ఛాన్స్.

Allu Arjun Arrest: ‘ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా? అల్లు అర్జున్‌కు అండగా న్యాచురల్ స్టార్ నాని

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున ను అరెస్టు చేయడంపై పలువురు సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై న్యాచురల్ స్టార్ నాని సంచలన ట్వీట్ చేశారు.

Allu Arjun Arrest: హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు..

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్టులో బిగ్ ట్విస్ట్.. మృతురాలు రేవతి భర్త సంచలన ప్రకటన

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పుడు ఇదే కేసు విషయమై సంచలన ప్రకటన చేశాడు మృతురాలు రేవతి భర్త భాస్కర్.

Allu Arjun Arrest: ఇదిగో సంధ్య థియేటర్ ఆ రోజు పంపిన లేఖ.. అంతా బయటకు వచ్చిందిగా

అల్లు అర్జున్ అరెస్ట్‌ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చిక్కడపల్లి తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ అవ్వడం ఈ రోజు బ్యానర్ ఐటం అయింది. ఇక ఈ కేసులో పోలీసుల వెర్షర్ ఒకలా ఉంటే.. థియేటర్ వెర్షన్ మరోలా ఉంది....

Allu Arjun Arrest: బెయిల్ నిరాకరణ.. అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్.. చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్

12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.