Allu Arjun: మృణాళ్ కాదు.. అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ ఫ్లాపుల హీరోయిన్.. బాబోయ్ వద్దంటున్న ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. నటీనటుల ఎంపికకు సంబంధించి చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది. ఇప్పటికే చాలా మంది నటీమణుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్ నటించే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ హిట్ కావడంతో, దానిని మించేలా సినిమాను తెరకెక్కించడం ఇప్పుడు దర్శకుల ముందున్న అతి పెద్ద సవాలు. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో చేతులు కలిపాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగేనటీనటుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. మృణాల్ ఠాకూర్ పేరు ఇంతకు ముందు ప్రముఖంగా వినిపించింది. అలాగే ప్రియాంక చోప్రా, జాన్వీ కపూర్, దిశా పటానీల పేర్లు కూడా బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ నటి అనన్య పాండే పేరు కూడా ఈ జాబితాలోకి వచ్చింది. నటి అనన్య పాండే తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. ఆమె గతంలో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఒకవేళ అనన్య పాండే అల్లు అర్జున్ నటించే కొత్త సినిమాలో నటించడానికి అంగీకరించినట్లయితే, ఇది ఆమె రెండవ తెలుగు సినిమా అవుతుంది.
తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. దీనికి తోడు ఈమె నటన పై బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘కేసరి: చాప్టర్ 2’ సినిమాలో అనన్య పాండే నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ కారణంతోనే దర్శకుడు అట్లీ అనన్యను ఎంపిక చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే అనన్య ఎంపికకు సంబంధించి చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
అనన్య లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
అల్లు అర్జున్ సినిమాను చాలా లావిష్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. చాలా VFX వర్క్ ఉంటుంది. విదేశాల్లో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో అల్లు అర్జున్ పాత్ర కోసం లుక్ టెస్ట్ నిర్వహించినట్లు కూడా సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రలు పోషిస్తాడని చెబుతున్నారు. అల్లు అర్జున్ తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది నటీమణుల పేర్లు వినిపిస్తున్నాయి.
ట్రెడిషినల్ శారీలో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి