OTT Movie: ఓటీటీలోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ! తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
భారీ అంచనాలతో ఏప్రిల్ 10న విడుదలైన ఈ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇప్పటికే 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

2023లో ‘గదర్ 2’ భారీ విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. ఈ క్రమంలోనే జాట్ అంటూ మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో ఆడియెన్స్ ను పలకరించాడు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వంద కోట్లు సాధిస్తుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోన్న జాట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో జాబ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే థియేట్రికల్ రన్ బాగుండడంతో మే ఆఖరి వారం లేదా జూన్ ఫస్ట్ వీక్ లోనైనా జాబ్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన జాట్ సినిమాలో రణ్ దీప్ హుడా విలన్ గా నటించాడు. అలాగే రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ , జగపతి బాబు , రమ్య కృష్ణ , వినీత్ కుమార్ సింగ్ , ప్రశాంత్ బజాజ్ , జరీనా వాహబ్ , పి. రవి శంకర్, పృథ్వీరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#Jaat, starring #SunnyDeol & #RandeepHooda, was released in theaters on April 10, & is expected to stream on #Netflix after its theatrical run. The standard 6–8-week theatrical window for B’ood films supports an estimated #OTTrelease around late May to early June. #JaatOnNetfix pic.twitter.com/dLJCuNd9cy
— OTTRelease (@ott_release) April 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








