AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా.. ఎవరో గుర్తు పట్టారా?

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఈ అమ్మాయి మొదట డాక్టర్ అవ్వాలనుకుంది. క్యాన్సర్ తో బాధపడుతోన్న తన తల్లిని చూసి అంకాలజిస్ట్ అవ్వాలని కలులు కంది. అందుకు తగ్గట్టుగానే బాగా చదివి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుంది. కానీ అనూహ్యంగా సినిమాల్లోకి అడుగు పెట్టింది.

Tollywood: అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 28, 2025 | 2:30 PM

Share

పై ఫొటోలో శివుని గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. అందుకే కూచిపుడి, భరత నాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పలు నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెల్చుకుంది. అంతేకాదు ఏడేళ్ల వయసులోనే మంగళం పల్లి బాలమురళీ కృష్ణ వంటి దిగ్గజాల చేతుల మీదుగా అవార్డులు అందుకుంది. ఇదే క్రమంలో పలు టీవీ రియాలిటీ షోల్లోనూ సత్తా చాటింది. అలాగే పలు కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. ఇదే క్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవంలోనూ సందడి చేసింది. అందులో శివుడి వేషధారణలో కనిపించి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. తన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇదే క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ లో, ఆ తర్వాత సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోన్న ఓ మూవీలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్ గా చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోతోంది. ఇంతకీ ఆమె ఎవరునుకుంటున్నారా? సారంగపాణి జాతకం సినిమా హీరోయిన్ రూపా కొడువాయూర్. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ సొగసరికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

రూప కొడువాయూర్ పేరు చూస్తే ఏదో మలయాళీ అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ ఆమె సొంతూరు. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ అందాల తార. అంతకు ముందు ఫౌజి అనే ఓ తెలుగు షార్ట్ ఫిల్మ్ లోనూ నటించింది. ఇక 2023లో బిగ్ బాస్ ఫేమ్ సొహైల్‌ ఖాన్ తో కలిసి మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో నటించింది. మళ్లీ ఇప్పుడు సారంగపాణి జాతకం సినిమాతో మనల్నిపలకరించింది. ఇందులో రూప నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

సారంగ పాణి జాతకం సినిమా ప్రమోషన్లలో రూపా కొడు వాయూర్..

అన్నట్లు రూపా కొడువాయూర్ డాక్టర్ గా కూడా విధులు నిర్వహిస్తోంది. ఎంబీబీఎస్ తర్వాత లండన్‌లో MD (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) కూడా పూర్తి చేసిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో