పెద్దిలో స్పెషల్ సాంగ్.. కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్.. ?

Rajitha Chanti

Pic credit - Instagram

01 March 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రంలో రాబోయే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించనుందట.

ఇదివరకే ఈబ్యూటీతో సంప్రదింపులు జరిగాయని సమచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి స్పెషల్ పాటకు మృణాల్ ఎనర్జిటిక్ స్టెప్పులు వేయనుందట. 

అయితే ఈ సినిమాలో ఒక పాటకు మృణాల్ రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే దీనిపై ఎక్కడా  అధికారిక ప్రకటన రాలేదు. 

మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ భామ.

ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. 

చాలా కాలంగా మృణాల్ హిందీ సినిమాలపై ఫోకస్ చేసింది. అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.