రెండు సినిమాలతో సెన్సేషన్.. ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ గట్టిగానే..

Rajitha Chanti

Pic credit - Instagram

27 February 2026

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తుంది.

ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ అమ్మడు ఇంత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 

2019లో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

ఇటీవల కాంతార 2 సినిమాతో ఆమె పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, కన్నడ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

అలాగే తమిళంలో ఏస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అలాగే తెలుగులో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా ఆకట్టుకోలేదు.

అయినప్పటికీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే చేతినిండా భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈముద్దుగుమ్మ.

 ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెనండీ రెమ్యునరేషన్ విషయం.

ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట మారుమోగుతుంది. ఇప్పటివరకు 12 సినిమాల్లో నటించింది.