ఆ హీరోలు నన్ను రిజెక్ట్ చేశారు.. టాలీవుడ్ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

28 February 2026

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సౌత్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తనతో నటించడానికి చాలా మంది హీరోలు వెనకడుగు వేశారని తెలిపింది.

కారణాలు తెలియదు కానీ తనతో సినిమా చేయనని అనేవారని.. అలా కొన్ని అవకాశాలు చేజారిపోయాయని తెలిపింది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. 

చాలా సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది హీరోనే నిర్ణయిస్తాడని అన్నారు. కొందరు దర్శకులు మాత్రమే ఫలానా హీరోయిన్ కావాలని పట్టుబడతారని తెలిపింది. 

వారు కోరుకున్న హీరోయిన్ తోనే సినిమా స్టార్ట్ చేస్తారని అన్నారు. డండీ సినిమాలో డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తననే తీసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిపింది. 

నిజానికి షారుఖ్ కాన్ ఎప్పుడు చేసే హీరోయిన్లతో వేరు అని.. అది బ్రేక్ చేస్తూ తనను ఎంపిక చేయడంతో చాలా మంది షాకయ్యారని తాప్సీ చెప్పుకొచ్చింది.

తనతో పనిచేయడం చాలా కష్టమని ఒక రూమర్ కూడా బయట ఉందని.. అదెలా వచ్చిందో తనకు అర్థం కాలేదని.. దర్శకులు మాత్రం మళ్లీ మళ్లీ పనిచేశారని తెలిపింది.

నాతో పని చేయడం కష్టమైతే సెకండ్ టైమ్ నన్నెందుకు తీసుకుంటారు.. నాతో పని చేయనివారు నా గురించి తెలియనివారే రూమర్స్ పుట్టిస్తారని చెప్పుకొచ్చింది.