తెలుగులో వరుస హిట్లు.. బాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 February 2026
తెలుగు సినిమా ప్రపంచంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. కొన్ని రోజులుగా ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని ఆకట్టుకున్నాయి.
ఆమె సహజ నటన, పాత్ర, సినిమా ఎంపికలో జాగ్రత్తలు తన కెరీర్ ను బలంగా నిలబెట్టాయి. మోడలింగ్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది ఈ భామ.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హిట్ 2 సినిమా మాత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.
ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్. అది కూడా ఓ స్టార్ హీరోతో నటించనుందట.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు తెలుస్తోంది. 2006 సూపర్ హిట్ భాగమ్ భాగ్ సీక్వెల్‌ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఆయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వెల్లడించనున్నట్లు తెలుస్తోం
అక్కినేని నాగచైతన్య సరసన వృషకర్మ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.