Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Agarwal: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్‌

7/G బృందావన్ కాలనీ... 2004లో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సినిమా. రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ప్రేమకథా సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే వదిలిపెట్టని వారు చాలా మంది ఉన్నారు.

Sonia Agarwal: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్‌
7g Brindavan Colony Movie
Basha Shek
|

Updated on: Apr 27, 2025 | 4:10 PM

Share

ప్రేమకథా చిత్రాలకు సంబంధించి 7/G బృందావన్ కాలనీ మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే సుమన్ శెట్టి, చంద్ర మోహన్, సుధ, మనోరమ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2004 నవంబర్ లో రిలీజైన 7/G బృందావన్ కాలనీ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా కుర్రకారు ఈ సినిమాకు ఫిదా అయిపోయి థియేటర్లకు పరుగులు తీశారు. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమా అయిపోయిన తర్వాత చాలామంది బాధా తప్త హృదయంతో బయటకు వస్తారు. ఇక నటీనటుల విషయానికి వస్తే.. రవికృష్ణ తన నటనతో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ సోనియా అయితే కుర్రకారు హృదయాల్లో నిలిచిపోయింది. 7/G బృందావన్ కాలనీ తర్వాత పలు తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిందీ అందాల తార. ముఖ్యంగా కోలీవుడ్ లో ధనుష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ స్పీడ్ గా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్లకే ఆ కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

విడాకుల తర్వాత సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది సోనియా అగర్వాల్. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే, పలు టీవీ షోల్లో సందడి చేస్తోంది. తెలుగులో టెంపర్, విన్నర్, రెడ్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిందీ అందాల తార. ఇక గతేడాది తమిళంలో మూడు సినిమాలు చేసింది సోనియా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు తమిళ్ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా 7/G బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో సోనియా నటించడం లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లోనే ఆమె పాత్ర ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

సోనియా అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సోనియా. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను తరచూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. కాగా ప్రస్తుతం బరువు తగ్గి నాజూగ్గా మారిపోయింది సోనియా. తన ఫొటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 ఆధ్యాత్మిక భావనలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.